spot_img
Homeఎంటర్టైన్మెంట్RRR Japan Collections: జపాన్ లో #RRR వసూళ్ల ప్రభంజనం.. జపనీస్ లో ఎన్టీఆర్ అదరగొట్టాడు.....

RRR Japan Collections: జపాన్ లో #RRR వసూళ్ల ప్రభంజనం.. జపనీస్ లో ఎన్టీఆర్ అదరగొట్టాడు.. మొదటి రోజు ఎంత వసూళ్లంటే?

RRR Japan Collections: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో మన అందరికి తెలిసిందే..ఇప్పుడు ఈ సినిమా పాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ ని టార్గెట్ చేసింది..ఇటీవలే జపాన్ భాషలోకి అనువదింపబడ్డ ఈ సినిమా ఈరోజు జపాన్ లో ఘనంగా విడుదలైంది..ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం అక్కడ ఎన్టీఆర్ రామ్ చరణ్ లతో పాటు రాజమౌళి కూడా వారం రోజుల నుండి జపాన్ లోనే మకాం వేశారు..అక్కడి మీడియా తో ఇంటరాక్ట్ అవుతూ #RRR సినిమా గురించి విశేషాలను పంచుకున్నారు.

 

RRR Japan Collections
RRR Japan Collections

ఇక ఈరోజు థియేటర్స్ లో విడుదల అవ్వగా #RRR టీం థియేటర్ లో ప్రేక్షకుల మధ్య సినిమా చూసారు..ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కి జపాన్ లో మొదటి నుండి అద్భుతమైన క్రేజ్ ఉండడంతో వాళ్లిదరు జపాన్ లో ఏ మూలకి వెళ్లిన అభిమానుల తాకిడి తీవ్రంగా ఉంది..ఇక ఈరోజు అక్కడ విడుదలైన ఈ సినిమాకి మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి.. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. #RRR సినిమాకి మొదటి రోజు ఇక్కడ 8 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి అట.. ఇప్పటి వరుకు ఇక్కడ విడుదలైన ఇండియన్ మూవీస్ కి మొదటి రోజు ఎన్ని టికెట్స్ అమ్ముడుపోయాయి..

ఒకసారి విశ్లేషిస్తే బాహుబలి పార్ట్ 2 సినిమాకి ఇక్కడ 1382 టిక్కెట్లు అమ్ముడుపోగా, దంగల్ సినిమాకి 1265 టిక్కెట్లు అమ్ముడుపోయాయి..ఈ రెండిటికి మించి #RRR ఈ రేంజ్ భారీ మార్జిన్ తో రికార్డు కొట్టడం అందరిని షాక్ కి గురి చేస్తుంది..ఇక వసూళ్ల పరంగా చూస్తే మన ఇండియన్ సినిమాలలో ఇక్కడ ఫుల్ రన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ ముత్తు సినిమాకి 400 మిలియన్ డాలర్ల వసూళ్లు రాగా, బాహుబలి 2 సినిమాకి 300 మిలియన్ డాలర్లు, బాహుబలి కి 75 మిలియన్ డాలర్లు మరియు సాహూ సినిమాకి 35 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి..ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన మగధీర సినిమాకి ఇక్క 16 మిలియన్ల డాలర్లు వసూలు వచ్చాయి.

RRR Japan Collections
NTR

ఇప్పుడు #RRR కి కేవలం మొదటి రోజే 12 మిలియన్ల జపనీస్ డాలర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం..ఇదే ఫ్లో ని కొనాగిస్తే జపాన్ లో ఈ సినిమా ముత్తు రికార్డ్స్ ని బద్దలు కొట్టే అవకాశం ఉందని తెలుస్తుంది.

ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ జపనీస్ లో మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. ‘అందరికీ నమస్కారం.. మీరు ఎలా ఉన్నారు.. మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఈ మూవీ చూసి ఎంజాయ్ చేయండి.. తాంక్యూ’ అంటూ జపనీస్ లో తారక్ వాఖ్యానించారు. గతంలో ఆర్ఆర్ఆర్ కోసం హిందీ సహా పలు భాషల్లో మాట్లాడిన తారక్.. ఇప్పుడు జపనీస్ లోనూ మాట్లాడేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

https://twitter.com/RMediaOff/status/1583473219813593088?s=20&t=sjmvCqlNzWjICHOED2kHGQ

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
Oktelugu Epaper