Ritu Chaudhary Latest Photos: రీతూ చౌదరి జబర్దస్త్ లేడీ కమెడియన్ గా పాప్యులర్. ఇంస్టాగ్రామ్ వేదికగా గ్లామరస్ ఫోటో షూట్స్ తో మరింత ఫేమస్ అయ్యింది. రీతూ చౌదరి లేటెస్ట్ ఫోటో షూట్ చూస్తే మనసు గతి తప్పక మానదు.
సీరియల్ నటిగా కెరీర్ ఆరంభించింది రీతూ చౌదరి(RITHU CHOWDARY). పలు సీరియల్స్ లో నటించింది. గోరంటాకు ఆమె మొదటి సీరియల్. అనంతరం సూర్యవంశం, ఇంటి గుట్టు వంటి సీరియల్స్ లో కీలక పాత్రలు చేసింది. సీరియల్స్ రీతూకి పెద్దగా ఫేమ్ తేలేదు. దాంతో జబర్దస్త్ లేడీ కమెడియన్ గా మారింది. హైపర్ ఆది స్కిట్స్ లో రీతూ చౌదరి ప్రముఖంగా కనిపించేది. హైపర్ ఆది జబర్దస్త్ వదిలేశాక, రీతూ చౌదరి సైతం మానేసింది. హైపర్ ఆది లేకపోవడంతో నేను జబర్దస్త్ లో ఒంటరిగా ఫీల్ అయ్యాను. అందుకే జబర్దస్త్ కి దూరమయ్యానని రీతూ చౌదరి చెప్పుకొచ్చింది.
Also Read: కింగ్ డమ్ ఫస్ట్ రివ్యూ… విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కాలర్ ఎగరేయొచ్చా?
రీతూ చౌదరి ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ తరచుగా వైరల్ అవుతాయి. మితిమీరిన గ్లామర్ షోతో రీతూ చౌదరి నెటిజెన్స్ ని ఆకర్షిస్తుంది. ఆమె ఫోటోలపై నెగిటివ్ కామెంట్స్ చేసే వారి సంఖ్య కూడా ఎక్కువే. కానీ రీతూ చౌదరి ఆ కామెంట్స్ పట్టించుకోరు. తాజాగా మరోసారి గ్లామర్ గేట్లు ఎత్తేసింది. రీతూ చౌదరి బోల్డ్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. సౌందర్య ఆరాధకులు రీతూ చౌదరి గ్లామర్ షోని ఎంజాయ్ చేస్తున్నారు.
రీతూ చౌదరి నటిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇటీవల వెల్లడించింది. వ్యూహం వెబ్ సిరీస్లో రీతూ చౌదరి ఓ రోల్ చేయడం విశేషం. అవకాశాలు వస్తున్నా… మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నట్లు రీతూ చౌదరి చెబుతున్నారు. ఆ మధ్య ధావత్ పేరుతో ఓ టాక్ షోని హోస్ట్ చేసింది రీతూ చౌదరి. సదరు షోలో గెస్ట్స్ ని డబుల్ మీనింగ్ ప్రశ్నలు అడిగి హాట్ టాపిక్ అయ్యింది. ధావత్ టాక్ షోలో రీతూ చౌదరి డ్రెస్సింగ్ సైతం విమర్శలపాలైంది.
ఆ మధ్య రీతూ చౌదరి ఓ పొలిటికల్ కాంట్రవర్సీ ఎదుర్కొంది. ఇక రీతూ చౌదరి రిలేషన్స్ విషయానికి వస్తే గతంలో శ్రీకాంత్ అనే వ్యక్తితో రీతూ చౌదరి సన్నిహితంగా కనిపించింది. అతన్ని వివాహం చేసుకుంటున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఆ వ్యక్తితో రీతూ చౌదరి విడిపోయినట్లు అనంతరం పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె సింగిల్ స్టేటస్ అనుభవిస్తుంది.
View this post on Instagram