Homeఎంటర్టైన్మెంట్Anasuya Bharadwaj Warning Buchi Babu: రామ్ చరణ్ డైరెక్టర్ కు అనసూయ వార్నింగ్!

Anasuya Bharadwaj Warning Buchi Babu: రామ్ చరణ్ డైరెక్టర్ కు అనసూయ వార్నింగ్!

Anasuya Bharadwaj Warning Buchi Babu: ఫైర్ బ్రాండ్ అనసూయ ఏకంగా రామ్ చరణ్(RAM CHARAN) తో సినిమా చేస్తున్న దర్శకుడికి వార్నింగ్ ఇచ్చిందట. విషయం ఏదైనా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడే అనసూయ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. ఇంతకీ ఆ మేటర్ ఏంటో చూద్దాం..

Also Read: కింగ్ డమ్ ఫస్ట్ రివ్యూ… విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కాలర్ ఎగరేయొచ్చా?

అనసూయ భరద్వాజ్(ANASUYA BHARADWAJ)… ఒకప్పటి ఈ స్టార్ యాంకర్, నటిగా బిజీ. విలక్షణ పాత్రలతో తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకుంది. క్షణం, రంగస్థలం, కథనం, పుష్ప, విమానం, పుష్ప 2, పెదకాపు చిత్రాల్లో అనసూయ కీలక రోల్స్ చేసింది. పుష్ప సిరీస్లో దాక్షాయణిగా విలనిజం పండించింది. విమానం మూవీలో అనసూయ వేశ్య పాత్ర చేయడం విశేషం. వెయ్యి ఇస్తే ఎవడైనా ఓకే… అంటూ ఛాలెంజింగ్ రోల్ లో అలరించింది. అనసూయ ఫిల్మోగ్రఫీ లో రంగస్థలం చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది.

అనసూయకు నటిగా పునాది వేసిన చిత్రంగా రంగస్థలం ఉంది. ఆ చిత్రంలో రంగంమ్మత్త గా సహజ నటనతో ఆకట్టుకుంది. చరణ్-అనసూయ కాంబోలో వచ్చే సన్నివేశాలు నవ్విస్తాయి, ఏడిపిస్తాయి. కాగా రంగస్థలం దర్శకుడు సుకుమార్ ని పబ్లిక్ లో ఇరకాటంలో పెట్టి పుష్ప లో ఆఫర్ పట్టేసింది అనసూయ. పుష్ప లో తనకు పాత్ర ఎందుకు ఇవ్వలేదని ఓ సినిమా ఈవెంట్ లో గట్టిగా అడిగింది. అనసూయ దెబ్బకు సుకుమార్ సైతం దిగొచ్చాడు. దాక్షాయణి రోల్ ఆమె కోసం రాశాడు.

సుకుమార్ ని రిక్వెస్ట్ చేసిన అనసూయ ఆయన శిష్యుడికి అయితే వార్నింగ్ ఇచ్చిందట. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు హీరో రామ్ చరణ్ తో పెద్ది చేస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న పెద్ది చిత్రంలో రామ్ చరణ్ డీ గ్లామర్ లుక్ సరికొత్తగా ఉన్నాడు. విడుదలైన ఫస్ట్ గ్లిమ్ప్స్ మెగా ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. కాగా ఈ చిత్రంలో ఓ పాత్ర తనకు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతుందట అనసూయ. ఈ మేరకు బుచ్చిబాబుకు గట్టి వార్నింగ్ ఇచ్చిందట. తాజా ఇంటర్వ్యూలో అనసూయ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది.

సౌమ్యుడైన బుచ్చిబాబు అనసూయ వార్నింగ్ కి ఎలా స్పందిస్తాడో చూడాలి. బుచ్చిబాబు సినిమాల్లో లేడీ రోల్స్ చాలా బలంగా ఉంటాయని, అందుకే ఖచ్చితంగా పెద్ది సినిమాలో పాత్ర కోరుకుంటున్నట్లు అనసూయ ఓపెన్ అయ్యింది. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో పెద్ది చిత్రం తెరకెక్కుతుంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా పెద్ది విడుదల కానుంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా పెద్ది థియేటర్స్ లోకి రానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించడం విశేషం.

RELATED ARTICLES

Most Popular