Red Ball Test Format: టి20, వన్డే ఫార్మాట్లో తెలుపు రంగు బంతి కనిపిస్తుంది. అదే సుదీర్ఘ ఫార్మాట్ విషయానికి వచ్చేసరికి ఎరుపు రంగు బంతి దర్శనమిస్తుంది. వాస్తవానికి ఎరుపు రంగు బంతిని సుదీర్ఘ ఫార్మాట్లో ఎందుకు వాడుతారనే విషయంపై చాలామందికి చాలా రకాల అభిప్రాయాలు ఉంటాయి. మొదటినుంచి కూడా క్రికెట్లో ఎరుపు రంగు బంతినే వాడుతున్నారు.. ఎరుపు రంగు బంతిని కార్క్, లెదర్ ముక్కలు, తాడు ఉపయోగించి చేస్తారు.. రెండు లెదర్ ముక్కల మధ్య సమర్థవంతమైన కార్క్ ఉంటుంది. ఇటువంటి యంత్రం సహాయం లేకుండానే.. దానిని చేతితో 60 నుంచి 80 కుట్ల వరకు వేసి రూపొందిస్తారు.
Also Read: కింగ్ డమ్ ఫస్ట్ రివ్యూ… విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కాలర్ ఎగరేయొచ్చా?
బంతి నిరూపం గుండ్రంగా రావడానికి యంత్రాన్ని ఉపయోగిస్తారు. ఆ తర్వాత దానిపైన మైనం పోర పూస్తారు. పాలిష్ చేసి మెరిసే విధంగా రూపొందిస్తారు. బంతి 2.8 నుంచి 2.86 అంగుళాల వ్యాసం, 8.819 అంగుళాల చుట్టుకొలత, 155.9 నుంచి 163 గ్రాముల బరువు ఉండేలా చూస్తారు. మొదట్లో వన్డే ఫార్మాట్లో కూడా ఎరుపు రంగు బంతిని ఉపయోగించేవారు. కాలక్రమంలో వన్డే, టి20 ఫార్మాట్లో తెలుపు రంగు బంతిని ఉపయోగించడం మొదలుపెట్టారు. టి20, వన్డే ఫార్మాట్ లో మ్యాచ్ లు ఎక్కువగా డే అండ్ నైట్ జరుగుతుంటాయి. బంతి ప్లేయర్లకు స్పష్టంగా కనిపించడానికి తెలుపు రంగు బంతిని ఉపయోగించడం మొదలుపెట్టారు. తెలుపు రంగు బంతి చూసేందుకు ప్రకాశవంతంగా కనిపించినప్పటికీ.. అది త్వరగా నే పాడవుతుంది. కానీ ఎరుపు రంగు బంతి అలా కాదు.. ఇది అత్యంత సమర్థవంతంగా ఉంటుంది. పైగా టెస్ట్ అంటే ఐదు రోజులపాటు ఆడాల్సి ఉంటుంది. రోజులో తక్కువలో తక్కువ 60 నుంచి 100 ఓవర్ల వరకు బౌలింగ్ వేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు టెస్ట్ క్రికెట్ కు తెలుపు రంగు బంతులను ఉపయోగిస్తే ప్రయోజనం ఉండదు. అందువల్లే ఎరుపు రంగు బంతిని వాడుతుంటారు.
టెస్ట్ క్రికెట్ లో ఎరుపు రంగు బంతిని 80 ఓవర్లకు ఒకసారి మాత్రమే మార్చుకుంటారు. అయితే ఫ్లడ్ లైట్స్ వెలుగులో ఎరుపు రంగు బంతి అంత స్పష్టంగా కనిపించదు. అందువల్లే డే అండ్ నైట్ టెస్టుల కోసం పింక్ కలర్ బంతిని వాడుతున్నారు. ఎరుపు రంగు బంతి పై తెలుపు రంగు దారం ఉంటే.. గులాబీ రంగు బంతికి మాత్రం నలుపు రంగు దారం వాడతారు. గులాబీ రంగు బంతి మైదానంపై మంచి వచ్చినప్పటికీ.. గ్రిస్ కోల్పోకుండా ఉంటుంది.. ఎరుపు రంగు బంతి పిచ్ ను బట్టి మెలికలు తిరుగుతూ ఉంటుంది. అయితే కొంతమంది బౌలర్లు మాత్రం తమ చాకచక్యంతో బంతితో అద్భుతాలు చేస్తారు.. అందువల్లే వారు ఎరుపు రంగు బంతితో బౌలింగ్ వేయడాన్ని ఇష్టపడుతుంటారు. టి20, వన్డే ఫార్మాట్లలో తెలుపు రంగు బంతి కొన్ని సందర్భాలలో బౌలర్లకు అంతగా సపోర్టు ఇవ్వదు. కానీ రెడ్ కలర్ బాల్ అలా కాదు.. అరుదైన సందర్భాలలో మాత్రమే ఆ బంతి బౌలర్లకు విసుగు తెప్పిస్తుంది. ఇక ఇప్పుడు సరికొత్త ప్రమాణాలతో ఎరుపు రంగు బంతిని వాడుతున్నారు. అంపైర్లు రకరకాల పరీక్షల తర్వాత పాత బంతిని మార్చి.. కొత్త బంతిని ఆటగాళ్లకు ఇస్తున్నారు.