Vijay Deverakonda Kingdom: పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో విజయ్ దేవరకొండ(VIJAY DEVARAKONDA) స్టార్ అయ్యాడు. ఈ రౌడీ హీరోకు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో ఆయన నటించిన కింగ్ డమ్(KINGDOM) చిత్రంపై హైప్ ఏర్పడింది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కింగ్ డమ్ చిత్రానికి దర్శకుడు. హీరో రామ్ చరణ్ తో గౌతమ్ తిన్ననూరి చేయాల్సిన ప్రాజెక్ట్ ఆగిపోయింది. అదే కథను విజయ్ దేవరకొండతో కింగ్ డమ్ గా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఫస్ట్ లుక్ తోనే ఆడియన్స్ ని ఆకర్షించారు కింగ్ డమ్ టీమ్. రా అండ్ రస్టిక్, ఇంటెన్స్ తో కూడిన విజయ్ దేవరకొండ లుక్ ఫ్యాన్స్ ని ఫిదా చేసింది.
Also Read: 9 రోజుల్లో 200 కోట్ల కలెక్షన్స్.. బాలీవుడ్ ను షేక్ చేస్తున్న ఓ చిన్న ప్రేమ కథ…
జెర్సీ చిత్రంతో గౌతమ్ తిన్ననూరి ప్రేక్షకులను మెప్పించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కింగ్ డమ్ పై పాజిటివ్ వైబ్స్ ఏర్పడటానికి గౌతమ్ తిన్ననూరి కూడా ఒక కారణం. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా కింగ్ డమ్ నిర్మించారు. సత్యదేవ్ కీలక రోల్ చేస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. జులై 31న కింగ్ డమ్ థియేటర్స్ లోకి వస్తుంది.
విడుదలకు మరో నాలుగు రోజుల సమయం ఉండగా… ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. కింగ్ డమ్ మూవీని చూసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తన అభిప్రాయం తెలియజేశాడు. ఆయన మాట్లాడుతూ… కింగ్ డమ్ మూవీ 45 నిమిషాల ఫుటేజ్ నేను చూశాను. అప్పటికి బీజీఎం కూడా యాడ్ చేయలేదు. అయినప్పటికీ ఆ విషయం మర్చిపోయి నేను లీనమైపోయాను. విజయ్ దేవరకొండ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. గౌతమ్ తిన్ననూరికి సూపర్ హిట్ పడింది.
Also Read: నాకొడుకు మనల్ని ఆపేదేలే..విజయ్ దేవరకొండ హాట్ కామెంట్స్!
కింగ్ డమ్ లో విజయ్ దేవరకొండ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడు. అతని లుక్స్ అదిరిపోయాయి. ఫస్ట్ లుక్ వచ్చినప్పుడే ఫోన్ చేసి అద్భుతంగా ఉందని చెప్పాను… అన్నారు. సందీప్ రెడ్డి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బీజీఎమ్ లేకుండానే మూవీ అంతగా లీనమయ్యేలా చేసింది అంటే.. పూర్తి స్థాయి చిత్రం మైండ్ బ్లాక్ చేస్తుందనడంలో సందేహం లేదు. సందీప్ రెడ్డి వంగా రివ్యూ ప్రకారం కింగ్ డమ్ సూపర్ హిట్.