Kantara 2: కాంతార 2 డ్యూయల్ రోల్లో నటిస్తున్న రిషబ్ శెట్టి… ఆ పాత్రలు ఏంటంటే..?

Kantara 2: రిషబ్ శెట్టి కాంతార 2 అనే సినిమాను చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఇద్దరు రిషబ్ శెట్టి లు మనకు కనిపించబోతున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

Written By: Gopi, Updated On : June 22, 2024 2:06 pm

Kantara 2

Follow us on

Kantara 2: కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఒక పెను సంచలనాన్ని సృష్టించిన కాంతార సినిమాని ఆ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకి భారీ సక్సెస్ రావడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక క్లాసికల్ సినిమాగా గుర్తిండిపోయింది. ఇక ఇలాంటి సినిమాను తీసినందుకు రిషబ్ శెట్టి కి చాలా అరుదైన గౌరవం కూడా దక్కింది. అలాగే అతనికి పలు అవార్డులు కూడా వచ్చాయి.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకి సీక్వెల్ గా ప్రస్తుతం రిషబ్ శెట్టి కాంతార 2 అనే సినిమాను చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఇద్దరు రిషబ్ శెట్టి లు మనకు కనిపించబోతున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక అందులో ఒక రిషబ్ శెట్టి సామాన్య మానవుడిగా కనిపిస్తే మరొక ఆయన అఘోర పాత్రలో కనిపించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి.అసలు కాంతార సినిమా కి కాంతార 2 సినిమాకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఇక అగోరా కు నార్మల్ రిషబ్ శెట్టి కి మధ్య ఇంటర్ లింక్ ఎలా కుదరబోతుంది అనే విషయాలను తెలియజేస్తూ ఒక క్యూరియాసిటీ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది.

Also Read: Deepika Padukone: కల్కి సినిమా ట్రైలర్ లో దీపిక పదుకొనే పాత్రను చూస్తుంటే దేవసేన గుర్తుకు వస్తుంది… ఎందుకంటే..?

అయితే ఈ సినిమా భారీ గ్రాఫికల్ సినిమాగా తెరకెక్కుతుంది. కాబట్టి దానికోసమే ఈ సినిమా రిలీజ్ కి మరి కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. ఇక దానికోసం ప్రతి ఒక్క అభిమాని కూడా చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చూసిన ప్రతి ఒక్కరికి గూజ్ బంప్స్ వచ్చాయనే చెప్పాలి.

Also Read: Star Heroes: ఇప్పటి వరకు ఒక్క ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టలేని ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఎవరంటే..?

అలాంటి ఒక డిఫరెంట్ సినిమాలో మనకు రిషబ్ శెట్టి కనిపించి మెప్పించడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో ఒక పాత్ర కోసం ఎంతటి రిస్క్ అయిన చేయడానికి రెడీగా ఉండే రిషబ్ శెట్టి అఘోర పాత్ర కోసం కూడా చాలా వరకు రిస్క్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరి మొత్తానికైతే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు గానీ ఈ సినిమా భారీ సక్సెస్ అవుతుందని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…