The Paradise Movie: ‘నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ తోనే ప్రేక్షకుల్లో విశేషమైన బజ్ ను క్రియేట్ చేసింది. నాని ఈసారి ఏదో గట్టిగానే చేస్తున్నాడు అంటూ ప్రేక్షకులందరు ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు. ప్రస్తుతం నాని డిఫరెంట్ ప్రయత్నాన్ని చేస్తున్నాడు. ఈ సినిమాలో తను డిఫరెంట్ క్యారెక్టర్ ని పోషిస్తున్నాడు. గతంలో దసరా సినిమాతో మాస్ హీరోగా అవతరించిన నాని ఆ తర్వాత సరిపోదా శనివారం, హిట్ 3 అలాంటి సినిమాలు చేశాడు. నిజానికి ఆ మూవీస్ డిఫరెంట్ జానర్స్ లో తెరకెక్కిన సినిమాలే కావడం విశేషం…కానీ ప్రస్తుతం ఇప్పుడు చేస్తున్న ప్యారడైజ్ సినిమా అతన్ని ఫుల్ టైమ్ మాస్ హీరోగా మార్చబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. తను ఏ సినిమా చేసిన కూడా ఏదో ఒక వైవిధ్యాన్ని చూపిస్తూ ఉంటాడు. కాబట్టి నాని ఈ సినిమాతో మరోసారి తన పేరు ప్రఖ్యాతలను పెంచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇప్పటికే ఈ సినిమా మీద 200 కోట్లకు పైన బడ్జెట్ కేటాయించారు.
కాబట్టి ఈ సినిమా 300 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టాల్సిన అవసరమైతే ఉంది. ఇక నాని కెరియర్లో సూపర్ హిట్లుగా నిలిచిన సినిమాలకే 100 కోట్లు రావడం పెద్ద కష్టమవుతుంది. ఇలాంటి క్రమంలో ప్యారడైజ్ సినిమా టాక్ ఎలా ఉండబోతుందనే విషయంలో ఎవరికీ నమ్మకం లేదు.
ఎందుకంటే ఈ సినిమా అనుకున్న రోజుల కంటే ఎక్కువ రోజులు షూటింగ్ అవుతుంది. అలాగే ఇప్పుడు బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు వీలైనంత తొందరగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నంలో మేకర్స్ ఉన్నారు.
దానికి అనుగుణంగానే సినిమా అనుకున్న క్వాలిటీలో తెరకెక్కుతుందా? లేదా అనేది కూడా ఇప్పుడు సినిమా మీద ప్రభావం చూపించబోతుంది. శ్రీకాంత్ ఓదెల మొదట ఏదైతే అనుకొని బరిలోకి దిగాడో దాన్ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగలుగుతున్నాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
