Pink Dolphins: గులాబీ రంగులో అరుదైన డాల్ఫిన్స్ చూస్తే షాక్ లాగా వైరల్ ఫోటోలు

ఎవరి వాదనలు వారు వినిపిస్తుండడంతో పింక్‌ డాల్ఫిన్‌పై ఇప్పుడు సోషల్‌ మీడియాలో పెద్ద ^è ర్చ జరుగుతోంది. ఇది ఏఐ కాదని, అప్పుడప్పుడు ఇలాంటి అరుదైన జవంతువులు కనిపిస్తాయని కొందరు తెలిపారు.

Written By: Raj Shekar, Updated On : June 22, 2024 2:08 pm

Pink Dolphins

Follow us on

Pink Dolphins: ప్రకృతి అనేక వింతలు, విశేషాలకు నెలవు. మనకు తెలియని అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. అరుదుగా కొన్ని వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా అలాంటి ఒక వింత సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆ వింతను మనం చూస్తేగాని నమ్మలేం. ఆ వింతే గులాబీ రంగు డాల్ఫిన్‌. దీని ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అమెరికాలోని నార్త్‌ కరోలినా తీరంలో ఇది కనిపించినట్టు ఈ ఫొటోలకు క్యాప్షన్‌ పెట్టారు.

ఎక్స్‌లో పోస్టు చేసిన నెటిజన్‌..
ఈ పింక్‌ డాల్ఫిన్‌ ఫొటోను “Facts Matter” అనే ఎక్స్‌ యూజర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘‘నార్త్‌ కరోలినా తీరంలో అరుదైన పింక్‌ డాల్ఫిన్‌ కనిపించింది!’’ అని దానికి క్యాప్షన్‌ రాశారు. తర్వాత ఈ గులాబీ రంగు డాల్ఫిన్‌ ఫొటోలు వైరల్‌ అయ్యాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇలాంటి పింక్‌ డాల్ఫిన్స్‌ నిజంగానే ఉంటాయా అనే ప్రశ్న కొందరికి వచ్చింది. ఫొటోలను పరిశీలించిన కొందరు.. ఆ డాల్ఫిన్‌ సహజ సిద్ధంగా లేదని, ప్లాస్టిక్‌ లుక్‌ ఉందని ఏఐద్వారా దానిని క్రియేట్‌ చేసి ఉండొచ్చని కొందరు పేర్కొంటున్నారు.

ఫేక్‌ అనడానికి ఆధారాలవీ..
ఆ డాల్ఫిన్‌ నిజం కాదనడానికి దాని నుదుటిపై కోలా అనే పదం కనిపిస్తుంది. దగ్గరగా చూసినప్పుడు అది నిజమైన జీవిలా కాకుండా ప్లాస్టిక్‌ బొమ్మలా కనిపిస్తుంది. దీంతో ఇది ఫేక్‌ ఫొటో అని చాలా మంది పేర్కొంటున్నారు. అయితే కొంతమంది మాత్రం పింక్‌ డాల్ఫిన్‌ చాలా అందంగా ఉందని కామెంట్లు చేశారు.

నెట్టింట్లో చర్చ..
ఎవరి వాదనలు వారు వినిపిస్తుండడంతో పింక్‌ డాల్ఫిన్‌పై ఇప్పుడు సోషల్‌ మీడియాలో పెద్ద ^è ర్చ జరుగుతోంది. ఇది ఏఐ కాదని, అప్పుడప్పుడు ఇలాంటి అరుదైన జవంతువులు కనిపిస్తాయని కొందరు తెలిపారు. కొన్నేళ్ల క్రితం లూసియానా దగ్గర ఇలాంటి పింక్‌ డాల్ఫిన్‌ కనిపించిందని కొందరు పేర్కొంటున్నారు. అల్బినో డాల్ఫిన్లు చాలా అరుదుగా ఉంటాయని ఒక యూజర్‌ పేర్కొన్నాడు. పింక్‌ డాల్ఫిన్లు నిజంగానే ఉండవచ్చు, కానీ ఈ ఫొటోలు మాత్రం సహజత్వానికి దూరంగా ఉన్నాయని మరొకరు తెలిపారు. దీనిని నిజంగా చూస్తే కాని నమ్మలేం.. తానైనే బీరు కిందపడేసి అక్కడికి వెళ్లా అని మరో నెటిజన్‌ పేర్కొన్నాడు. దీనిని చాê బాగా తయారు చేసిన బొమ్మ. అన్ని ఫొటోల్లో ఒకే భంగిమలో ఉన్న డాల్ఫిన్‌ అని ఇంకొకరు పోస్టు పెట్టారు.

నిజంగా ఉన్నాయి..
ఇదిలా ఉండగా పింక్‌ డాల్ఫిన్లు ఈ భూ ప్రపంచంలో నిజంగానే ఉన్నాయి. వాటిని అమెజాన్‌ రివర్‌ డాల్ఫిన్స్‌ లేదా బోటోస్‌ అని పిలుస్తారు. సాధారణంగా ఇవి దక్షిణ అమెరికాలోని అమెజాన్, ఓరినోకో బేసిన్లలోని మంచినీటి నదులు, ఉపనదులలో కనిపిస్తాయని చాలా మంది పేర్కొంటున్నారు. వీటికి ప్రత్యేకమైన గులాబీ రంగు ఉంటుంది. కొన్ని జీవుల రంగు లేత గులాబీ నుంచి మరింత ముదురుగా కూడా మారుతుంటుంది. ఎక్కువగా మగ డాల్ఫిన్లు పింక్‌ కలర్‌లో కనిపిస్తాయి. వయస్సు, ఆహారం, సూర్యరశ్మి వంటి అంశాల ద్వారా వాటి కలర్‌ ప్రభావితమవుతుంది.