Star Heroes: ఒకప్పుడు ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోలు మంచి విజయాలను అందుకొని ఇండస్ట్రీ ని ముందుకు తీసుకెళ్లారు. ఇక వీళ్ళ తర్వాత జనరేషన్ గా ఇండస్ట్రీలో చాలా మంచి సినిమాలను తీసి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటుల్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లు ఉన్నారు.
ఇక చిరంజీవి బాలకృష్ణ మాస్ హీరోలుగా ఎదిగితే వెంకటేష్ నాగార్జున లు మాత్రం క్లాస్ సినిమాలు చేస్తూ ముందుకు సాగారు. ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి తన ఎంటైర్ కెరియర్లో దాదాపు 8 ఇండస్ట్రీ హిట్లను సొంతం చేసుకోగా, బాలకృష్ణ మాత్రం 3 ఇండస్ట్రీ హిట్లను కొట్టాడు. ఇక వెంకటేష్, నాగార్జునలు మాత్రం ఇప్పటివరకు ఒక ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టలేదు. నాగార్జున శివ సినిమాతో బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందుకున్నప్పటికీ అది ఇండస్ట్రీ హిట్ గా కన్వర్ట్ కాలేకపోయింది.
Also Read: Prasanth Varma-Prashanth Neel: ప్రశాంత్ వర్మ కి ప్రశాంత్ నీల్ కి మధ్య ఉన్న తేడా ఇదే…
ఇక వెంకటేష్ కూడా చంటి, బొబ్బిలి రాజా లాంటి సినిమాలతో భారీ సక్సెస్ అయితే అందుకున్నాడు. కానీ దాన్ని ఇండస్ట్రీ హిట్ గా మార్చుకోలేకపోయాడు. ఇక వీళ్లు నలుగురు స్టార్ హీరోలుగా ఒకప్పుడు మంచి గుర్తింపును సంపాదించుకుంటూ వచ్చారు. ఇక వీళ్ళు సీనియర్ హీరోలుగా ఇప్పటికీ కూడా వరుస సినిమాలు చేస్తున్నప్పటికి వాళ్ల ఎంటైర్ కెరియర్ లో నాగార్జున వెంకటేష్ లకు ఒక్కటి కూడా ఇండస్ట్రీ హిట్టు లేకపోవడం అనేది నిజం గా ఒక వెలితిగానే చెప్పుకోవాలి. ప్రస్తుతం నాగార్జున, వెంకటేష్ ఇద్దరు కూడా సినిమాలు సక్సెస్ అవ్వలేక ఫ్లాప్ హీరోలుగానే గుర్తింపు పొందుతున్నారు.
Also Read: Box Office Records: పాన్ ఇండియా లో ఈ రెండు సినిమాల రికార్డ్ లను బ్రేక్ చేసేది ఆ ఇద్దరేనా..?
మరి వీళ్ళు ఎప్పుడూ సక్సెస్ ఫుల్ హీరోలుగా మారతారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక అందులో భాగంగానే శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న ‘కుబేర ‘ సినిమాలో నాగార్జున ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక వెంకటేష్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక కామెడీ ఎంటర్ టైనర్ ను చేస్తున్నాడు. ఇక మొత్తానికైతే వీళ్ళు ఇప్పుడు వచ్చే సినిమాలతో ఒక భారీ సక్సెస్ ని సాధించి మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నారు…