Varanasi Movie Poster: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు బ్యాక్ డ్రాప్ ను పరిచయం చేస్తూ రాజమౌళి గతంలోనే ఒక గ్లింప్స్ రిలీజ్ చేశాడు. ఇక ఇందులో ఈ సినిమా యొక్క కాన్సెప్ట్ ఏంటి అనేది ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇక దానికి తగ్గట్టుగానే ఇందులో భాగం అయిన నటి నటుల ఫస్ట్ లుక్ పోస్టర్ లను సైతం రిలీజ్ చేశారు. ఇక ఈరోజు ఇందులో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తుండటం విశేషం…
ఈ రోజు తన బర్త్ డే కావడంతో ఆమెకు సంబంధించిన ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో ఆమె చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. నిజానికి ఈ సినిమాలో తనకి చాలా మంచి పాత్ర దొరికిందట. ఆమె నటించడానికి కూడా చాలా స్కోప్ ఉండడంతో ఈ సినిమా తనకి చాలా బాగా హెల్ప్ అవుతుందని ఆమె భావిస్తుంది.
మొత్తానికైతే మహేష్ బాబు హీరోగా నటిస్తుండడం ఇది పాన్ వరల్డ్ లో రిలీజ్ అవుతుండడం ప్రియాంక చోప్రా కూడా ఇందులో భాగమవ్వడం ఇవన్నీ చాలా గొప్ప విషయాలనే చెప్పాలి. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కొత్తగా కనిపిస్తుందట. ఆమె ఇంతకు ముందే హాలీవుడ్ లో కొన్ని సినిమాలను చేసింది. కాబట్టి వాటన్నింటికి మించి ఈ సినిమాలో తన పాత్ర ఉంటుందట. అందుకే ఆమె ఏరికోరి మరి ఈ సినిమాని సెలెక్ట్ చేసుకుందట. రాజమౌళి సైతం ఆమె ను డిఫరెంట్ గా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆమె ఇందులో రెండు, మూడు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ లో తను కనిపించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి…
రాజమౌళి సినిమాలో హీరోయిన్ అంటే సాంగ్స్ మాత్రమే పరిమితం అవ్వదు. ఆమెకి కూడా ఒక సపరేట్ ట్రాక్ ఉంటుంది. కథలో భాగం అవుతూనే వాళ్ళకి కూడా ఎమోషన్స్ ని పండించగలిగే స్కోప్ ఉన్న పాత్రలని రాజమౌళి రాసుకుంటాడు. అందువల్లే ఆయన సినిమాల్లో హీరోయిన్స్ కి కూడా సపరేట్ క్రేజ్ ఉంటుంది…
