Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటసింహం బాలయ్య బాబుకి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. నందమూరి తారక రామారావు గారి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన చాలా తక్కువ సమయంలోనే టాప్ హీరోగా మారిపోయాడు. మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరోగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఆయన్ని టాప్ లెవెల్లో నిలిచోబెట్టినప్పటికీ ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో సైతం ఆయన చాలా కేర్ఫుల్గా వ్యవహరిస్తున్నాడు. అయితే బాలయ్య బాబు దగ్గర ఎవరైనా ఎక్స్ ట్రా లు చేస్తే మాత్రం బాలయ్య చేతిలో వాళ్ళకు దెబ్బలు తప్పవు అనేది పలు సందర్భాల్లో ఆయన ప్రూవ్ చేశాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక ఇద్దరు దర్శకులు సైతం అతని దగ్గర కొన్ని ఎక్స్ ట్రాలు చేశారట.
బాలయ్య వాళ్ళను కొట్టారట. ఇంతకీ ఆ దర్శకులు ఎవరు అంటే బాలయ్య బాబుతో వీరభద్ర అనే సినిమా చేసిన ఎఎస్ రవికుమార్ చౌదరి ఒకరు కాగా, మరొకరు ఎవరంటే అప్పట్లో బాలయ్య బాబు తన స్నేహితుడికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారట. వివేక్ అనే పేరు గల ఆ వ్యక్తి ఒక షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత అతనికి డైరెక్షన్ మీద క్లారిటీ లేకపోవడం సినిమా ఆపేసినట్టుగా తెలుస్తుంది.
వివేక్ కి డైరెక్షన్ చేయడం రాదని బాలయ్య అతన్ని సెట్ లోనే రెండు దెబ్బలైతే కొట్టాడట. దాంతో ఆ సినిమా ఆగిపోయింది. ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు దగ్గర దర్శకులు క్లారిటీగా ఉంటే ఆయన వాళ్లకు సరెండర్ అయిపోయి యాక్టింగ్ చేస్తుంటాడు. వాళ్లు కన్ఫ్యూజన్ తో ఉన్న, ఏదైనా డిస్టేబెన్స్ క్రియేట్ చేసిన కూడా బాలయ్య తన విశ్వరూపాన్ని చూపిస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. వీరభద్ర సినిమా సమయంలో ఎ ఎస్ రవికుమార్ చౌదరి మందు తాగి సెట్ కి వచ్చే వాడట.
ఆ సినిమా ప్రొడ్యూసర్ ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. దాంతో ఒకరోజు బాలయ్య బాబు దగ్గర రవికుమార్ చౌదరి నిర్లక్ష్యంగా మాట్లాడడంతో బాలయ్య అతన్ని కొట్టాడు అనే కామెంట్స్ కూడా చేశాడు… ఇక ప్రస్తుతం బాలయ్య స్టార్ డైరెక్టర్లతో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు…
