https://oktelugu.com/

Deepika Padukone: కల్కి సినిమా ట్రైలర్ లో దీపిక పదుకొనే పాత్రను చూస్తుంటే దేవసేన గుర్తుకు వస్తుంది… ఎందుకంటే..?

Deepika Padukone: బాహుబలి మొదటి పార్ట్ లో దేవసేన తన కొడుకు కోసం తలుచుకుంటూ తనకి వేసిన సంకెళ్లను తొలగించడానికి ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది.

Written By:
  • Gopi
  • , Updated On : June 22, 2024 / 01:59 PM IST

    Seeing Deepika Padukone character in the trailer of Kalki

    Follow us on

    Deepika Padukone: భారీ అంచనాల మధ్య ఈనెల 27వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న కల్కి సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు విపరీతంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన సెకండ్ ట్రైలర్ ను కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ట్రైలర్ లో ‘దీపికా పదుకొనే’ క్యారెక్టర్ మనకు బాహుబలి సినిమాలో అనుష్క పోషించిన ‘దేవసేన ‘ పాత్రలాగా అనిపించింది.

    ఇక బాహుబలి మొదటి పార్ట్ లో దేవసేన తన కొడుకు కోసం తలుచుకుంటూ తనకి వేసిన సంకెళ్లను తొలగించడానికి ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక అలాగే కల్కి సినిమాలో కూడా తన కొడుకు అయిన కల్కి కోసం దీపిక పదుకొనే ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక ఆయన వచ్చి జనాలని ఎలా కాపాడాడు అనే కాన్సెప్ట్ తోనే ఈ సినిమా తెరకెక్కింది. కాబట్టి ఇప్పుడు జనాలు బాహుబలి సినిమాకి కల్కి సినిమాకి మధ్య పోల్చి చూస్తున్నారు.

    Also Read: Box Office Records: పాన్ ఇండియా లో ఈ రెండు సినిమాల రికార్డ్ లను బ్రేక్ చేసేది ఆ ఇద్దరేనా..?

    ఇక గతంలో బాహుబలి 2 సినిమా దాదాపు 2000 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టి ఇండియాలోనే అత్యధిక వస్తువులను సాధించిన సినిమాగా ఒక హిస్టరీని క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా ఇప్పుడు బాహుబలి 2 రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక మొదటి నుంచి కూడా ఈ సినిమాను బాహుబలితో పోలుస్తూ వస్తున్నారు.

    Also Read: Prasanth Varma-Prashanth Neel: ప్రశాంత్ వర్మ కి ప్రశాంత్ నీల్ కి మధ్య ఉన్న తేడా ఇదే…

    కలెక్షన్స్ పరంగా అయిన, బడ్జెట్ పరంగా అయిన, ఇక క్యారెక్టర్స్ పరంగా అయిన ఏ విషయంలో చూసుకున్న ఈ సినిమా బాహుబలి కి సిమిలర్ గా ఉంటూ వస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా యూనిట్ ఒక భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది… చూడాలి మరి ఈ సినిమాతో ఎలాంటి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తారు అనేది…