https://oktelugu.com/

Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’ సినిమా కోసం ఆర్జీవి ఫజిల్.. ఆన్సర్ ఇస్తే లక్షల రూపాయలు ఇస్తాడట.. ఇంతకీ ఏంటది?

Kalki 2898 AD: సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ వైపు డిఫరెంట్ సినిమాలు తీస్తూ.. మరోవైపు ట్విట్ల ద్వారా సంచలనాలు సృష్టిస్తాడు. సినీ ఇండస్ట్రీకి చెందిన కొన్ని విషయాల్లో ఆర్జీవీ దూరి తనదైన శైలిలో స్పందిస్తాడు.

Written By:
  • Gopi
  • , Updated On : June 22, 2024 / 01:54 PM IST

    RGV puzzle on Kalki 2898 AD Trailer

    Follow us on

    Kalki 2898 AD: ప్రభాస్ నటించిన లేటేస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’ గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన రెండు వీడియోలు రిలీజ్ అయ్యాయి. వీటిలో లేటేస్టుగా జూన్ 21 శుక్రవారం ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ట్రైలర్ ను చూసిన సినీ జనం సినిమా గురించి మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు. మరోవైపు ప్రభాస్ నటనను చూసి ప్యాన్స్ తో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది మెచ్చుకుంటున్నారు. వీరిలో రాంగోపాల్ వర్మ కూడా ఉన్నారు. అయితే ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఆర్టీవీ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.. అదేంటంటే?

    సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ వైపు డిఫరెంట్ సినిమాలు తీస్తూ.. మరోవైపు ట్విట్ల ద్వారా సంచలనాలు సృష్టిస్తాడు. సినీ ఇండస్ట్రీకి చెందిన కొన్ని విషయాల్లో ఆర్జీవీ దూరి తనదైన శైలిలో స్పందిస్తాడు. లేటేస్టుగా ప్రభాస్ ‘కల్కి 2898 AD’ ట్రైలర్ చూసి ఆర్టీజీ ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమాలో ప్రభాస్ నటన అద్భుతం అని కీర్తించాడు. అయితే అందరిలా స్పందిస్తే తన ప్రత్యేకత ఏముంటుందీ? అనుకున్నాడు ఆర్జీవి.. అందుకే ఏం చేశాడంటే..

    Also Read: Prasanth Varma-Prashanth Neel: ప్రశాంత్ వర్మ కి ప్రశాంత్ నీల్ కి మధ్య ఉన్న తేడా ఇదే…

    ‘కల్కి 2898 AD’ సినిమా ట్రైలర్ పై ఆర్జీవి ప్రేక్షకులకు ఓ ఫజిల్ ను అందించాడు. కొన్ని పదాలు ఇచ్చి.. వీటి మధ్యలో కొన్ని లెటర్స్ ను మిస్ చేశాడు. ఈ లెటర్స్ పూర్తి చేసిన వారికి లక్షల రూపాయలు ఇస్తానంటు ఆఫర్ ఇచ్చాడు. అయితే ముందుగా ఎవరు దీనిని పూర్తి చేయగలరో చెప్పండి అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ ఫజిల్ ను పోస్ట్ చేశాడు. ఈ ఫజిల్ పై ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే ముందుగా ఎవరు స్పందింది లక్షల రూపాయలు పొందుతారో చూడాలి.

    Also Read: Box Office Records: పాన్ ఇండియా లో ఈ రెండు సినిమాల రికార్డ్ లను బ్రేక్ చేసేది ఆ ఇద్దరేనా..?

    ఇక ‘కల్కి 2898 AD’ మూవీ జూన్ 27న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే టిక్కెట్ల కొనుగోలుపై తీవ్ర పోటీ ఎదుర్కొటన్నట్లు తెలుస్తోంది. నాగ్ అశ్వీన్ ప్రతిష్టాత్మకంగా తీసిన ఈ మూవీ కోసం రూ.600 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ప్రభాస్ తో పాటు ఇందులో దీపీకా పదుకునే హీరోయిన్ గా నటిస్తోంది. వీరితో పాటు కమలాసన్ లాంటి సీనియర్ నటులు కూడా కనిపించనున్నారు.