Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh Ettara Ettara Song: 'ఎత్తరా ఎత్తరా' పాటలో పవన్ కళ్యాణ్ డ్యాన్స్...

Ustaad Bhagat Singh Ettara Ettara Song: ‘ఎత్తరా ఎత్తరా’ పాటలో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ పై అభిమానుల అసంతృప్తి.. ట్వీట్లు చూస్తే ఆశ్చర్యపోతారు!

Ustaad Bhagat Singh Ettara Ettara Song: పాటలు బాగుంటే డ్యాన్స్ బాగుండదు, డ్యాన్స్ బాగుంటే పాటలు బాగుండవ్, ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం లోని పాటల పరిస్థితి ఇది. డిసెంబర్ నెలలో విడుదలైన ‘దేఖ్లేంగే సాలా’ పాటలో పవన్ కళ్యాణ్ స్టెప్పులను చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోయారు. కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన డ్యాన్స్ తో ఫ్యాన్స్ ని సంబ్రమాశ్చర్యాల్లోకి నెట్టేశాడు. కానీ ఆ పాట ట్యూన్ మాత్రం చాలా రొటీన్ గా అనిపించింది. ట్యూన్ కూడా బాగా ఉండుంటే పాట వేరే లెవెల్ కి వెళ్లి ఉండేదని అభిమానుల అభిప్రాయం. ఇక నేడు కాసేపటి క్రితమే ఈ చిత్రం నుండి ‘ఎత్తరా ఎత్తరా’ పాట విడుదలైంది. ఈ పాట ట్యూన్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ డ్యాన్స్ మాత్రం చాలా నీరసంగా ఉందంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అంత మంచి పాటకు వేయాల్సిన స్టెప్పులా అవి, ఇంత బద్ధకం అయితే ఎలా అన్నా అంటూ పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేసి అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మొదటి పాట బాగాలేకపోయిన కూడా పవన్ కళ్యాణ్ స్టెప్పులా కారణంగా వేరే లెవెల్ కి రీచ్ అయ్యింది. కానీ రెండవ పాటకు అనుకున్నంత రీచ్ కచ్చితంగా రాదనీ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ మంచి ఎనర్జిటిక్ బీట్ కి నీరసంగా స్టెప్పులు వేసాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలా ట్విట్టర్ లో రెస్పాన్స్ ఇచ్చిన అభిమానుల ట్వీట్స్ కొన్నిటిని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి అయితే మెజారిటీ అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ డ్యాన్స్ కి సంతృప్తి చెందారు. పాటలో స్టెప్పులు చాలా సింపుల్ గా ఉన్నాయని, కానీ చాల గ్రేసీ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో మూడు పాటలు ఉంటే, అందులో రెండు పాటల్లో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ ఇరగదీశాడని, థియేటర్స్ లో ఫ్యాన్స్ కి పండగే అని అంటున్నారు.

అయితే ఇతర హీరోల అభిమానులు మాత్రం ఇలాంటి పాటలు డ్యాన్స్ బాగా వేసే హీరోలు అయినటువంటి ఎన్టీఆర్, రామ్ చరణ్ , అల్లు అర్జున్ లాంటోళ్ళకి పడుంటే వేరే లెవెల్ ఉండేది. పవన్ కళ్యాణ్ కి పడాల్సింది కాదంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఆపరేషన్ సక్సెస్ , పేషెంట్ డైడ్ అన్నట్టు తయారైంది ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ మూవీ లోని లేటెస్ట్ సాంగ్ పరిస్థితి. ఇంకా ఈ చిత్రం నుండి ఒక మెలోడీ సాంగ్ రావాలి, అదే విధంగా మార్చి 15 న జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫ్యాన్స్ కి ఒక సర్ప్రైజ్ ఉందంటూ డైరెక్టర్ హరీష్ శంకర్ రీసెంట్ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. మరి ఆ సర్ప్రైజ్ ఏంటో చూడాలి. ఇకపోతే ఈ నెల 14 న థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాబోతుంది.

 

Collar Ey Etthara - Lyric Video | Ustaad Bhagat Singh | Pawan Kalyan |Harish Shankar|Devi Sri Prasad

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version