Prasanth Varma-Prashanth Neel: ప్రస్తుతం ఇండియన్ సినిమా స్టాండర్డ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా పాన్ ఇండియాను బేస్ చేసుకొని సినిమాలు చేస్తూ భారీ సక్సెస్ లను అందుకుంటున్నారు. ఇక అందులో భాగంగానే ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ హనుమాన్ ‘ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. అయితే ఈ సినిమా దర్శకుడు అయిన ప్రశాంత్ వర్మ ఎప్పుడు కొత్త ఐడియాలతో సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ని చూపిస్తుంటాడు.
ఇక అందులో భాగంగానే ఆయన గతంలో చేసిన ‘అ ‘ సినిమా గానీ రాజశేఖర్ తో చేసిన ‘కల్కి ‘ సినిమా గానీ, ‘జాంబిరెడ్డి ‘ లాంటి సినిమాలు కూడా డిఫరెంట్ అటెంప్ట్ లుగా చెప్పుకోవచ్చు…ఇక కన్నడ సినిమా డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ కూడా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు చేసినప్పటికీ వాటిలో వైవిధ్యమైన అంశాలైతే ఉంటాయి. ఇక ముఖ్యంగా ఆయన చాలా కొత్త బ్యాక్ డ్రాప్ ను ఎంచుకొని కొత్తగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే కేజిఎఫ్ సిరీస్ గాని సలార్ సినిమా గాని సూపర్ సక్సెస్ ను అందుకున్నాయి.
ఇక ప్రశాంత్ నీల్, ప్రశాంత్ వర్మ ఇద్దరూ కూడా ఇండియన్ సినిమా డైరెక్టర్స్ కావడం నిజంగా మంచి విషయమనే చెప్పాలి. వీళ్ళిద్దరూ సినిమా ఇండస్ట్రీకి చాలా సేవలను అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని వాడుకుంటూ హాలీవుడ్ స్టాండర్డ్ సినిమాలని తెరకెక్కిస్తూ ఉంటాడు. ప్రశాంత్ నీల్ మాత్రం కమర్షియల్ సినిమాలను ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించి సక్సెస్ ని సాధిస్తూ ఉంటాడు.
ఇక ఈ ఇద్దరిలో ఉన్న తేడా ఇదే అయినప్పటికీ ఇద్దరు కూడా ఎమోషన్స్ ను చాలా బాగా హ్యాండిల్ చేస్తూ సినిమాలని సక్సెస్ చేస్తూ ఉంటారు. ఇక ఫ్యూచర్ లో ఈ ఇద్దరు కూడా ఇంకా చాలా ఉన్నంత స్థాయి కి వెళ్తారు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు…