Homeఆధ్యాత్మికంToday 13 March 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారింట్లో లక్ష్మి తాండవం..

Today 13 March 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారింట్లో లక్ష్మి తాండవం..

Today 13 March 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం శుక్రవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ధనయోగం కలగనుంది. మరి కొన్ని రాశుల వారు డబ్బు వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తిచేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూల్ అవుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని తప్పుల వల్ల అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో అధిక లాభాలు పొందుతారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. అయితే కెరీర్ పైకి ఎలక నిర్ణయం తీసుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకునేవారు పెద్దలను సంప్రదించడం మంచిది. సొంత వాహనాలపై ప్రయాణం అంత మంచిది కాదు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. వీరికి తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కొత్త పెట్టుబడుల కోసం సిద్ధమవుతారు.
.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన సమాచారం గురించి శుభవార్తలు వింటారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల మద్దతుతో సమస్యలు పరిష్కరించుకుంటారు. తోటి వారి విషయంలో ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులతో ఆర్థిక వివరాలు జరుపకుండా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండవచ్చు. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. ప్రయాణాలు చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పెద్దల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ఉత్సాహంగా పనిచేస్తారు. ఆగిపోయిన పనులను పూర్తి చేసుకుంటారు. పెండింగ్లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మధ్యత ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. వీరికి అధికారుల మద్దతు ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఇదే సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. విద్యార్థులు కెరీర్ పైకి కీలక నిర్ణయం తీసుకుంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు శుభవార్తలు వింటారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో సంతోషంగా ఉంటారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులకు భాగస్వాముల మధ్య కొత్త ఒప్పందాలు ఏర్పడతాయి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని పనులు పూర్తి చేయడానికి కష్టపడాల్సి రావచ్చు. అయినా కూడా అనుకున్న పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన ధర్మాలు చేస్తారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణ ఉంటుంది. శుభకార్యాలు నిర్వహించడానికి సిద్ధమవుతారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకూడదు. కొత్తగా పెట్టుబడులు పెట్టే వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విహార యాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. విహారయాత్రలకు వెళ్లేందుకు స్నేహితులతో ప్లాన్ చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సోదరులు మధ్య పూర్వీకుల ఆస్తికి సంబంధించి పంపకాలు జరుగుతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version