Rashmika Mandanna: రీసెంట్ గానే పెళ్లి విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ని పెళ్ళాడి, మెహందీ ఫంక్షన్ లో సంబరాలు చేసుకుంటూ కనిపించిన రష్మిక(Rashmika Mandanna), ఇప్పుడు ఫైర్ మోడ్ లోకి వచ్చేసింది. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై ఆమె తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమె మాట్లాడుతూ ‘నాపై గత 8 ఏళ్లుగా తప్పుడు ప్రచారం చేస్తూ, నా వ్యక్తిగత ప్రతిష్టతని దెబ్బ తీస్తున్నారు. నేను నా జీవితం లో ఎప్పుడూ మాట్లాడని పదాలతో కొంతమంది తప్పుడు కథనాలు అల్లుతున్నారు. ఈ తప్పుడు ప్రచారం నన్ను మానసికంగా చాలా బాధ పెట్టినప్పటికీ, నేనెంతో సహనం వహిస్తూ వచ్చాను. 8 ఏళ్ళ క్రితం నేను ఫోన్ లో మాట్లాడిన ఒక ప్రైవేట్ సంభాషణ ని సోషల్ మీడియా లో లీక్ చేసి ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తూ నన్ను టార్గెట్ చేస్తున్నారు’
Also Read: ‘ఎత్తరా ఎత్తరా’ పాటలో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ పై అభిమానుల అసంతృప్తి.. ట్వీట్లు చూస్తే ఆశ్చర్యపోతారు!.
‘నా వ్యక్తిగత గోప్యతపై తీవ్రమైన దాడి చేస్తూ , నా పరువుకు భంగం కలిసాగిస్తున్నారు. నా సహనం నశించింది. ఇకపై మౌనం గా చూస్తూ ఊరుకోలేను. సోషల్ మీడియా లో ఉండే ఇన్ ఫ్లుయెన్సర్లు రాబోయే 24 గంటల్లో నా పై ప్రచారం చేసిన తప్పుడు కథనాలను తొలగించాలి. లేదంటే రేపటి నుండి సంబంధిత వ్యక్తులపై న్యాయపరమైన కఠిన చర్యలు తీసుకుంటాను. నా జీవితం ఎలా ఉండాలో వాళ్ళు ఎలా నిర్ణయిస్తారు. మన జీవితాలు మనమే చూసుకోవాలి ‘ అంటూ రష్మిక చాలా ఫైర్ మీద ఒక పోస్ట్ పెట్టింది. ఇంతలా ఫైర్ అయ్యేంతగా అసలు ఏమి జరిగిందంటే , రష్మిక గతం లో కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి తో ప్రేమాయణం నడిపి, నిశ్చితార్థం చేసుకుంది. ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ నిశ్చితార్థం రద్దు అయ్యింది.
అయితే నిశ్చితార్థం జరిగిన కొత్తల్లో రష్మిక – రక్షిత్ శెట్టి తల్లి మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ ని సోషల్ మీడియా లో గుర్తు తెలియని వ్యక్తులు లీక్ చేయగా అది బాగా వైరల్ అయ్యింది. దీంతో వెంటనే రష్మిక ఈ విధంగా రెస్పాన్స్ ఇచ్చింది. ఈ ఆడియో రికార్డు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. మొత్తం కన్నడ లో ఈ ఆడియో ఉంది. ఏమి మాట్లాడుకున్నారో అర్థం కావడం లేదు కానీ, ఇద్దరు పెద్ద ఎత్తున గొడవలు వేసుకున్నట్టు తెలుస్తోంది.