Box Office Records: సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటే అయిపోయింది. ఏ సినిమా తీసిన కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఆ సినిమాలకి ఇండియా వైడ్ గా మంచి ఆదరణ అయితే దక్కుతుంది. ఒకవేళ సినిమా బాగలేకపోతే మాత్రం ఆ సినిమాని అన్ని భాషల్లోను తిరస్కరిస్తున్నారు. ఇక మొత్తానికైతే ఒక సినిమా సూపర్ సక్సెస్ అయిందంటే ఆ సినిమాలో నటించిన నటీనటులకు డైరెక్టర్ కి విపరీతమైన క్రేజ్ అయితే వస్తుంది.
ఇక పాన్ ఇండియాలో ఇప్పటివరకు భారీ రికార్డులను సాధించిన బాహుబలి, దంగల్ లాంటి సినిమాల రికార్డులను బ్రేక్ చేయడం ఎవరి వల్ల అవుతుంది అనే ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాలు దాదాపు 20 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టాయి. కాబట్టి ఆ సినిమాలను ఢీకొట్టే సినిమాలు ఈ మధ్యకాలంలో రాలేదు మరి ఇక మీదట అయిన వస్తాయా లేదా అనే అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ రికార్డులను బ్రేక్ చేయాలంటే అది ప్రభాస్ వల్లనే అవుతుంది.
Also Read: Kalki Movie: రిలీజ్ కి ముందే ఓవర్సీస్ లో భారీ రికార్డ్ లను క్రియేట్ చేస్తున్న కల్కి…
లేదంటే రాజమౌళి ద్వారా అయిన అవుతుంది అంతే తప్ప ఇప్పుడు ఉన్న హీరోల్లో ఎవరి వల్ల కాదు అంటూ మరికొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇండియా వైట్ గా ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిన కూడా 12, 13 వందల కోట్ల వరకే కలెక్షన్లను రాబడుతున్నాయి. ఇక ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది కాబట్టి ఆయన లాంటి హీరో నుంచి ఒక మంచి సినిమా వస్తే మాత్రం ఆయన ఈ రికార్డును బ్రేక్ చేస్తాడు.
Also Read: Gopichand Malineni: ఆ స్టార్ హీరో స్టోరీ తోనే సన్నీ డియోల్ తో సినిమా చేస్తున్న గోపిచంద్ మలినేని…
ఇక లేదంటే మాత్రం రాజమౌళి మహేష్ బాబు తో చేయబోయే సినిమాతో ఖచ్చితంగా ఈ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇక వీరిద్దరిని మినహాయిస్తే ఇప్పుడప్పుడే ఈ సినిమా రికార్డును బ్రేక్ చేసే వాళ్ళు ఎవరూ కనిపించడం లేదు…ఇక అమీర్ ఖాన్ కి కూడా ఆ అవకాశం ఉందా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఆయనకి కూడా ఈ రికార్డును బ్రేక్ చేయడం అంత ఈజీ అయితే కాదు…