Homeఎంటర్టైన్మెంట్Regina Cassandra: నిన్న "మ్యాగీ - మగాడు".. నేడు 'లిప్ లాక్ కిస్".. రెజినా నోటికి...

Regina Cassandra: నిన్న “మ్యాగీ – మగాడు”.. నేడు ‘లిప్ లాక్ కిస్”.. రెజినా నోటికి అడ్డూ అదుపు ఉండదా?

Regina Cassandra: మంచి రంగు, ఎత్తు, శరీర సౌష్టవం ఉన్నా.. ఒళ్ళు దాచుకోకుండా కష్టపడుతున్నా.. అదేంటో పాపం రెజీనా కసాండ్రకు ఇప్పటికీ సరైన బొమ్మ పడలేదు. అటు తెలుగు, ఇటు తమిళం, మరోవైపు మలయాళం.. ఎన్ని ఉడ్ లను తిరగేసినా అదృష్టం ఆవగింజంతైనా ఆమెకు అంట లేదు. ఆ మధ్య అడవి శేష్ తో ఎవరు అనే సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నా ఆశించినంత మేర అవకాశాలు రాలేదు. ఆచార్యలో చిరంజీవితో మందాకిని అని పిలిపించుకున్నా ప్రయోజనం దక్కలేదు. ఈమధ్య ఆహాలో ఆన్యస్ ట్యుటోరియల్ పేరుతో భయపెట్టే ప్రయత్నం చేసినా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇక తాజాగా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో సుధీర్ వర్మ దర్శకత్వంలో నివేదా థామస్ తో కలిసి శాకిని డాకినీ అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆ సినిమా విడుదలైంది. కొరియన్ సినిమాకు రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రెజీనా పోలీస్ పాత్ర పోషిస్తున్నది. ఈ సినిమా పైనే భారీగా ఆశలు పెట్టుకున్న రెజీనా.. ప్రమోషన్ కార్యక్రమాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. దీనివల్ల సినిమాపై మంచి బజ్ ఏర్పడిందని నిర్మాతలు అంటున్నారు.

Regina Cassandra
Regina Cassandra

నోరు అదుపులో ఉండదా..

ఆచార్య సరైన బ్రేక్ ఇవ్వకపోవడంతో.. రెజీనా ఎలాగోలా ఇండస్ట్రీలో నిలబడేందుకు పాట్లు పడుతున్నది. అయితే ఇందుకు ఆమె ఎంచుకున్న మార్గమే హాట్ టాపిక్ అవుతోంది. రెజీనా మాట్లాడితే అందర్నీ ఆకర్షించడమే కాకుండా.. వార్తల్లో నిలిచి ఉండేలా చేస్తున్నది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో “మ్యాగీ _ మగాడు” అంటూ ద్వంద్వార్థం జోక్ తో ఒక్కసారిగా ఆమె టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా గా మారింది. ఇప్పుడు “లిప్ లాక్” అంటూ మరో స్పెషల్ అప్డేట్ ను వదిలి శాకిని డాకిని కి సరిపడా క్రేజ్ వచ్చేలా చూసింది. “మగాళ్ళు_ మ్యాగీ రెండూ ఒకటే.! ఎందుకంటే రెండింటికి రెండు నిమిషాలు మాత్రమే అంటూ” ఒక అడల్ట్ జోకు పేల్చిన రెజీనా.. తాజాగా నిర్వహించిన ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన లిప్ లాక్ అనుభవం చెప్పి మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ఒకసారి రెజీనా వేరే పనిలో ఉంది. ఇదే సమయంలో ఓ మహిళ వచ్చి అకస్మాత్తుగా ఆమె పెదాలను కిస్ చేసింది. ఈ ఘటనతో రెజీనా ఒకసారిగా షాక్ కు గురైంది. కిస్ చేసింది మహిళ కావడంతో ఆమెను వెనక్కి నెట్టలేదు. ఒకవేళ అదే పని ఒక మగాడు చేసి ఉంటే అప్పటికప్పుడు చెంప పగలగొట్టే దానినని రెజీనా చెప్పుకొచ్చింది.

Regina Cassandra

“మ్యాగీ మగాడు” విషయంలో ఎలా అయితే రెజినా పేరు వినిపించిందో.. ఇప్పుడు ఈ “లిప్ లాక్” సంఘటనలో కూడా అలాగే మారుమోగుతోంది. అయితే గతంలో ఇంటర్వ్యూలు నిర్వహించినప్పుడు రెజీనా చాలా తక్కువగా మాట్లాడేది. కానీ ఇప్పుడు ఎదుటివారికి అవకాశం కూడా ఇవ్వడం లేదు. అకస్మాత్తుగా ఆమెలో వచ్చిన మార్పుకు ఇంటర్వ్యూయర్లు అవాక్కవుతున్నారు. పబ్లిసిటీ పీక్స్ లో ఉంటేనే ఎవరికైనా గుర్తింపు లభిస్తుందని లేటుగా తెలుసుకున్న రెజీనా ప్రస్తుతం అదే పనిలో ఉంది. కానీ ఇదే సమయంలో కాస్త నూటికి అందులో పెట్టుకుంటే మంచిదన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular