Homeజాతీయ వార్తలుCough Syrup Warning: నాలుగేళ్ల లోపు పిల్లలకు ఆ మందులు వాడొద్దు.. కేంద్ర ఆంక్షలు!

Cough Syrup Warning: నాలుగేళ్ల లోపు పిల్లలకు ఆ మందులు వాడొద్దు.. కేంద్ర ఆంక్షలు!

Cough Syrup Warning: ఇటీవలి కాలంలో మందులు వాడకంలో ప్రజలు కూడా సొంత వైద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆస్పత్రులకు వెళితే టెస్టుల పేరుతో దోపిడీ చేస్తుండడంతో మెడికల్‌ షాపులకు వెళ్లి కొనుగగోలు చేస్తున్నారు. ఇక వైద్యులు కూడా మార్జిన్‌ ఎక్కువ ఇచ్చే కంపెనీల మందులనే సూచిస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా కేంద్రం పిల్లలకు ఇచ్చే మందులపై ఆంక్షలు విధించింది. కేంద్ర ప్రభుత్వం చిన్నపిల్లల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని క్లోర్‌ఫెనిరమెన్‌ మలేట్, ఫినైల్‌ఫ్రిన్‌ హైడ్రోక్లోరైడ్‌ కలిగిన ఫిక్స్‌డ్‌ […]

Cough Syrup Warning: ఇటీవలి కాలంలో మందులు వాడకంలో ప్రజలు కూడా సొంత వైద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆస్పత్రులకు వెళితే టెస్టుల పేరుతో దోపిడీ చేస్తుండడంతో మెడికల్‌ షాపులకు వెళ్లి కొనుగగోలు చేస్తున్నారు. ఇక వైద్యులు కూడా మార్జిన్‌ ఎక్కువ ఇచ్చే కంపెనీల మందులనే సూచిస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా కేంద్రం పిల్లలకు ఇచ్చే మందులపై ఆంక్షలు విధించింది. కేంద్ర ప్రభుత్వం చిన్నపిల్లల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని క్లోర్‌ఫెనిరమెన్‌ మలేట్, ఫినైల్‌ఫ్రిన్‌ హైడ్రోక్లోరైడ్‌ కలిగిన ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ మందులపై కఠినమైన పరిమితులు విధించింది. ఈ నిర్ణయం ఎక్స్‌పర్ట్‌ కమిటీ, డ్రగ్స్‌ టెక్నికల్‌ అడ్వైజరీ బోర్డ్‌ సిఫార్సుల మేరకు వచ్చింది. నాలుగేళ్ల కంటే తక్కువ వయసు పిల్లలకు ఈ మందులు వాడకూడదని స్పష్టం చేస్తూ, తయారీ, అమ్మకం, పంపిణీపై హెచ్చరికలు తప్పనిసరి చేసింది. MAXTRA, T-MINIC, BAROHIST-AC, ALEX+DPS వంటి ప్రసిద్ధ బ్రాండ్‌లు ఈ కాంబినేషన్‌లో ఉన్నాయి.

ఈ మందులు వాడొద్దు..
ఈ ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ సాధారణంగా జలుబు, అలర్జీ లక్షణాలకు ఉపశమనం కలిగించేందుకు వాడతారు. క్లోర్‌ఫెనిరమెన్‌ మలేట్‌ అలర్జీ నివారణకు, ఫినైల్‌ఫ్రిన్‌ హైడ్రోక్లోరైడ్‌ ముక్కు దిబ్బడను తగ్గించడానికి సహాయపడతాయి. చిన్నపిల్లల్లో జలుబు, దగ్గు సమస్యలు సాధారణం కాబట్టి ఇవి విస్తృతంగా ప్రిస్క్రైబ్‌ అవుతున్నాయి. అయితే చిన్న వయసులో శరీరం ఈ మందులను ఎలా జీర్ణం చేసుకుంటుందో, దుష్ప్రభావాలు ఎలా ఉంటాయో శాస్త్రీయంగా పరిశీలించిన తర్వాతే ఈ ఆంక్షలు వచ్చాయి.

నిషేధం ఎందుకు..
నిపుణుల కమిటీలు ఈ కాంబినేషన్‌ చిన్నపిల్లలకు ప్రమాదకరం కావచ్చని, సురక్షితమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశాయి. కేంద్రం డ్రగ్స్‌ అండ్‌ కాస్మెటిక్స్‌ చట్టం సెక్షన్‌ 26ఏ కింద ఈ పరిమితులు విధించింది. తయారీదారులు లేబుల్, ప్యాకేజీ ఇన్‌సర్ట్, ప్రచార సామగ్రిపై ‘‘నాలుగేళ్ల లోపు పిల్లలకు ఈ ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ వాడకూడదు’’ అనే హెచ్చరికను తప్పనిసరిగా పెట్టాలని ఆదేశించింది. గతంలో కొన్ని ఫార్ములేషన్‌లపై ఇలాంటి హెచ్చరికలు ఉన్నా, ఇప్పుడు అన్ని రకాల ఫార్ములేషన్‌లకు విస్తరించారు. ఇది పబ్లిక్‌ హెల్త్‌ ప్రయోజనాల కోసం తీసుకున్న చర్య.

తల్లిదండ్రులు, వైద్యులు గమనించాలి,,
నాలుగేళ్ల లోపు పిల్లలకు ఈ మందులు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలి.
జలుబు లేదా దగ్గు వస్తే వైద్యుల సలహా లేకుండా మందులు వాడకూడదు. సెలైన్‌ నాసల్‌ డ్రాప్స్, తగినంత నీరు తాగడం, విశ్రాంతి వంటి సాధారణ చర్యలు సహాయపడవచ్చు. మందు ప్యాకెట్‌పై వయసు హెచ్చరికలు చూసి మాత్రమే వాడాలి.
వైద్యులు ప్రిస్క్రిప్షన్‌ ఇచ్చేటప్పుడు వయసును దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయాలను సూచించాలి.

ఇటీవల కాలంలో చిన్నపిల్లలకు ఇచ్చే కొన్ని కఫ్‌ సిరప్‌ల వల్ల ఆందోళనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్య తీసుకోవడం సానుకూలం. తల్లిదండ్రుల్లో అవగాహన, వైద్యుల్లో జాగ్రత్త పెంచేలా ఉంది. సురక్షితమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేయడం మరింత ఆశాజనకం. చిన్నపిల్లల ఆరోగ్యం అత్యంత సున్నితమైన విషయం. మందుల వాడకంలో జాగ్రత్త, వైద్యుల సలహా, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించడం ద్వారా మనం వారిని రక్షించుకోవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper