Homeఎంటర్టైన్మెంట్Tamanna vs Pooja Hegde: కర్ణాటక రాజకీయాల్లో తమన్నా , పూజా హెగ్డే..వీళ్లిద్దరి మధ్య ఊహించని...

Tamanna vs Pooja Hegde: కర్ణాటక రాజకీయాల్లో తమన్నా , పూజా హెగ్డే..వీళ్లిద్దరి మధ్య ఊహించని పోటీ..అసలు ఏమి జరుగుతోంది?

Tamanna vs Pooja Hegde: సినీ రంగం లో తమన్నా(Tamanna Bhatia), పూజ హెగ్డే(Pooja Hegde) లకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతీ ఏటా ఎంతో మంది యంగ్ హీరోయిన్లు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టొచ్చు, కానీ వీళ్లిద్దరి క్రేజ్ మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా, వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు ఈ ఇద్దరు హీరోయిన్స్. అయితే వీళ్లకు ఏ మాత్రం సంబంధం లేని రాజకీయాలు, ఇప్పుడు వీళ్లిద్దరు చుట్టూ తిరుగుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యం లో ఉండే మైసూర్ శాండిల్ సోప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు తమన్నా ని ఎంపిక చేశారు. ఒకప్పుడు దేశవ్యాప్తంగా మైసూర్ శాండిల్ సోప్స్ కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఈమధ్య కొత్త ప్రొడక్ట్స్ కారణంగా ఈ బ్రాండ్ కి కాస్త క్రేజ్ తగ్గింది.

అందుకే ప్రభుత్వం ఈ సోప్ ను రీ బ్రాండింగ్ చేస్తూ, నేడు లాంచింగ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే ఈ బ్రాండ్ కి తమన్నా ని ఎంపిక చేయడం పై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు, వాళ్ళని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకోవచ్చు కదా, ఎందుకు తమన్నా ని ప్రత్యేకించి తీసుకున్నారు. కర్ణాటక లో పుట్టిన పెరిగిన పూజా హెగ్డే ని ఎందుకు ఎంచుకోలేదు?, ఆమెతో పాటు రష్మిక మందాన,రుక్మిణి వాసంత్, శ్రీనిధి శెట్టి వంటి పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్లందరూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారే. క్రేజ్, ఫాలోయింగ్, ఫేమ్ విషయంలో వీళ్ళు తమన్నా కి ఏ మాత్రం తీసిపోరు. అయినప్పటికీ వీళ్ళలో ఎవరో ఒకరిని ప్రభుత్వం ఎందుకు ఎంచుకోలేదు అంటూ నిలదీస్తున్నారు ప్రతి పక్ష పార్టీ కి చెందిన నేతలు.

బీజేపీ పార్టీ నాయకులూ కూడా ఈ విషయం లో ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో తప్పుబడుతున్నారు. స్థానిక తారలను విస్మరించడం స్థానిక కాంగ్రెస్ నేత కన్నడ వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శమని అంటున్నారు. అలా తమన్నా, పూజా హెగ్డే , రష్మిక వంటి హీరోయిన్ల పేర్లు రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా అక్కడి నేతలు తీస్తున్నారు. అయితే కర్ణాటక ప్రభుత్వం మాత్రం ఈ విమర్శలను లెక్క చేయడం లేదు, వాళ్లకు చేయాలనుకున్న పనులు చేస్తూ ముందుకెళ్తున్నారు. ఈ నిర్ణయం పూర్తిగా వ్యాపార కోణం లో తీసుకున్నదే, ఇందులో భావోద్వేగాలకు చోటు లేదు, ప్రతిపక్షాలు ఈ అంశాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయాలనీ అనుకోవడం వాళ్ళ దిగజారుడు తనానికి నిదర్శనం అంటూ మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version