Box Office Hit: సినిమా ఇండస్ట్రీలో పండగ సీజన్ వచ్చిందంటే చాలు సినిమాల హడావిడి మొదలవుతుంది. రాజాసాబ్ సినిమాతో మొదలైన ఈ జాతర రేపు రాబోతున్న నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు మూవీ తో ముగియనుంది… ఇక ఇప్పటికే రిలీజ్ అయిన రాజా సాబ్, మన శంకర వరప్రసాద్, భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలు ఎలాంటి టాక్ ని మూట గట్టుకున్నాయి. ఈ మూడు సినిమాల్లో సక్సెస్ఫుల్ గా నిలిచిన సినిమా ఏది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
మారుతి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా వచ్చిన రాజాసాబ్ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మొదటి షో తోనే డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. ప్రభాస్ రేంజ్ కలెక్షన్స్ ని రాబట్టడంలో ఈ సినిమా పూర్తిగా వెనుకబడిపోయింది. ఇక చాలామంది ప్రేక్షకులు ఈ సినిమాను చూడడానికి సైతం ఇష్టపడటం లేదంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు…
అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన మన శంకర వరప్రసాద్ సినిమా మొదటి షో తో పాజిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. ఇక వింటేజ్ చిరంజీవి ఈ సినిమాలో కనిపించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఈ సినిమాను చూడడానికి ఎగబడుతున్నారు. ఇక కామెడీతో పాటు ఇందులో విక్టరీ వెంకటేష్ ఉండడం కూడా ఉండటం ఈ సినిమాకి చాలా వరకు హెల్ప్ అయిందనే చెప్పాలి. మొత్తానికైతే చిరంజీవి మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకు ముందు చేసిన భోళా శంకర్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో చిరంజీవి పని అయిపోయింది అంటూ ప్రతి ఒక్కరు కామెంట్లు చేశారు. మొత్తానికైతే తన స్టామినా చూపించి బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు.
రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మొదటి షో తోనే బిలో యావరేజ్ టాక్ ను మూటగట్టుకుంది. ఈ సినిమాలో కామెడీ పుష్కలంగా ఉన్నప్పటికి కంటెంట్ వైజ్ గా సినిమా ప్రేక్షకులకు పెద్దగా నచ్చడం లేదు. ఇక స్క్రీన్ ప్లే విషయంలో కూడా చాలావరకు వెనకబడి పోయారు. దానివల్ల ఈ సినిమా తేడా కొట్టిందని కూడా చెప్పేవారు ఉన్నారు…
ఇక ఫైనల్ గా ఈ మూడు సినిమాల్లో మన శంకర్ వరప్రసాద్ సినిమా విజయం సాధించింది. మిగతా రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించకపోవడమే కాకుండా వాళ్ళ అభిమానులను సైతం నిరాశపరచాయి…