Bhartha Mahasayulaku Wignyapthi Day 2 Collection: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్నటువంటి మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja), కాస్త తన ఇమేజ్ కి భిన్నంగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bharta Mahasyulaku Wignapti) చిత్రం ద్వారా మన ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి రవితేజ గత సినిమాలకంటే పర్లేదు అనే రేంజ్ టాక్ వచ్చింది. కానీ ఈ చిత్రం తో పాటు విడుదలైన మరో రెండు సినిమాలకు దీనికంటే బెటర్ టాక్ రావడం, ఆ సినిమాలకు టికెట్స్ దొరక్కపోతే జనాలు ఈ చిత్రాన్ని ఎంచుకోవడం వంటివి జరుగుతున్నాయి. ఫ్లీతంగా టాక్ కి తగ్గ వసూళ్లు మాత్రం రావడం లేదు. రవితేజ కి బ్యాడ్ లక్ ఈ రేంజ్ లో ఉంటుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. అయితే ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన వసూళ్లకంటే చాలా ప్రాంతాల్లో రెండవ రోజు వచ్చిన వసూళ్లే ఎక్కువ. అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఇది ఏ మాత్రం సరిపోదు , జోరు పెంచి తీరాల్సిందే.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రెండు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. రవితేజ గత చిత్రం ‘మాస్ జాతర’ కి మొదటి రోజు వచ్చిన వసూళ్లు ఇవి. సినిమా సినిమాకు ఆయన రేంజ్ తగ్గుతూ పోతుంది. ఇక ప్రాంతాల వారీగా ఈ రెండు రోజుల్లో ఈ చిత్రం రాబట్టిన వసూళ్లు ఎంతో చూద్దాం. నైజాం ప్రాంతం నుండి కోటి 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి సీడెడ్ నుండి 31 లక్షలు, ఆంధ్ర ప్రదేశ్ నుండి కోటి 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రానికి 3 కోట్ల 16 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కి కలిపి పాతిక లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, ఓవర్సీస్ నుండి 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 6 కోట్ల 85 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 4 కోట్ల 6 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రానికి విడుదలకు ముందు ప్రీ రిలీజ్ తెట్టఱికెల్ బిజినెస్ 20 కోట్ల రూపాయిల రేంజ్ లో జరిగింది. అంతే కచ్చితంగా ఈ చిత్రం మరో 16 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాల్సిందే అన్నమాట. నేడు, రేపు , మరియు వీకెండ్ వరకు ఈ చిత్రానికి భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. నేడు ఈ చిత్రానికి మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు రావొచ్చు. బుక్ మై షో యాప్ లో గంటకు 4 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. మొదటి రోజు కూడా ఈ రేంజ్ ట్రెండ్ లేకపోవడం విశేషం. ఇదే జోరుని కొనసాగిస్తూ వెళ్తే ఈ వీకెండ్ కి ఈ చిత్రం 14 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకోవచ్చు.