Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీHonor New Phone : డిస్ ప్లే వేరే లెవల్.. భారీ బ్యాటరీ తో మార్కెట్లోకి...

Honor New Phone : డిస్ ప్లే వేరే లెవల్.. భారీ బ్యాటరీ తో మార్కెట్లోకి వచ్చిన కొత్త ఫోన్..

Honor New Phone :  Honor కంపెనీ మార్కెట్లోకి కొత్త ఫోన్ ను తీసుకువచ్చింది. ఇప్పటి వరకు యూత్ తో పాటు ఉద్యోగులు, వ్యాపారులు ఎక్కువగా బ్యాటరీ విషయంలో ఇబ్బందులు పడేవారు. ఇలాంటి వారి కోసం బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా ఉండే ఈ ఫోన్ లో లేటేస్ట్ టెక్నాలజీతో కూడిన సాప్ట్ వేర్ ను కూడా అమర్చారు. అలాగే సినిమాలు, గేమ్స్ ఆడడానికి అనుగుణంగా ఉండే డిస్ ప్లే ఇందులో కనిపిస్తుంది. ఈ ఫోన్ గురించి పూర్తి […]

Honor New Phone :  Honor కంపెనీ మార్కెట్లోకి కొత్త ఫోన్ ను తీసుకువచ్చింది. ఇప్పటి వరకు యూత్ తో పాటు ఉద్యోగులు, వ్యాపారులు ఎక్కువగా బ్యాటరీ విషయంలో ఇబ్బందులు పడేవారు. ఇలాంటి వారి కోసం బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా ఉండే ఈ ఫోన్ లో లేటేస్ట్ టెక్నాలజీతో కూడిన సాప్ట్ వేర్ ను కూడా అమర్చారు. అలాగే సినిమాలు, గేమ్స్ ఆడడానికి అనుగుణంగా ఉండే డిస్ ప్లే ఇందులో కనిపిస్తుంది. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

హానర్ నుంచి కొత్తగా Turbo 5జీ పేరుతో మిడ్ రేంజ్ ఫోన్ ఇటీవల యూరేషియా ప్రాంతంలో రిలీజ్ అయింది. త్వరలో అంతర్జాతీయ మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ గురించి తెలిసిన తరువాత చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్స్ కొత్తగా ఫోన్ కొనుగోలు చేసేవారికి ఇది బెస్ట్ ఎంపిక అని అనుకుంటున్నారు.

ఈ ఫోన్ లో 6.79 అంగుళాల ఎమోల్డ్ డిస్ ప్లే ను చూడొచ్చు. ఇది ఫుల్ హెచ్ డి ప్లస్ తో పాటు అత్యధిక 120 హెచ్ జడ్ రిజల్యూషన్ ను కలిగి ఉండనుంది. దీంతో స్క్రోలింగ్ మరింత స్మూత్ గా ఉండనుంది. నిత్యం బ్రౌజింగ్ చేసేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫోన్ లో సాప్ట్ వేర్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇందులో స్నాప్ డ్రాగన్ 5 జెన్ 4 చిప్ సెట్ ను అమర్చారు. దీంతో సోషల్ మీడియా వాడేవారికి అనుగుణంగా ఉంటుంది. అలాగే వేగమైన పనితీరు కోసం ఇందులో 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ ఆప్షన్లు ఉండనున్నాయి.

నేటి కాలంలో ఫోన్ కొనే ముందు కెమెరా పనితీరును తెలుసుకుంటున్నారు. అలాంటి వారికి అనుగుణంగా ఇందులో 50 మెగా పిక్సెల్ కలిగిన మెయిన్ కెమెరా ఉండనుంది. అలాగే 5 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. వీడియో కాలింగ్ కోసం 16 మెగా పిక్సెల్ కెమెరా పనిచేయనుంది.

ఇక బ్యాటరీ విషయంలో ఏమాత్రం తగ్గలేదని తెలుస్తోంది. ఎందుకంటే ఇందులో భారీగా 8,560 ఎంఏహెచ్ బ్యాటరీని చేర్చారు. ఇది 80 వాట్ కలిగిన ఛార్జర్ సపోర్టు చేయనుంది. ఈ ఫోన్ బరువు 196 గ్రాములు మాత్రమే ఉండడంతో చేతిలో పట్టుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. ఈ ఫోన్ ఐపీ69 రేటింగ్ ను కలిగి ఉండడంతో నీటి బిందువులతో పాటు దుమ్ము ధూళి నుంచి రక్షణగా ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ. 33,990 గా నిర్ణయించారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper