Rashmika Mandanna
Rashmika Mandanna: రష్మిక మందాన- విజయ్ దేవరకొండ మధ్య సంథింగ్ సంథింగ్ అనే పుకార్లు చాలాకాలంగా ఉన్నాయి. వీరి ప్రవర్తన ఈ ఊహాగానాలకు దారి తీసింది. విజయ్ దేవరకొండ కెరీర్ ని నిలబెట్టిన చిత్రాల్లో గీత గోవిందం ఒకటి. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. విజయ్ దేవరకొండ-రష్మిక మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. డియర్ కామ్రేడ్ మూవీలో మరోసారి కలిసి నటించారు. డియర్ కామ్రేడ్ లో రొమాన్స్ హద్దులు దాటింది. లిప్ కిస్సుల్లో రెచ్చిపోయి నటించారు.
డియర్ కామ్రేడ్ ఆశించిన స్థాయిలో ఆడకున్నా రష్మిక-విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ హైలెట్ అయ్యింది. ఇక లైగర్ చిత్రీకరణ సమయంలో విజయ్ దేవరకొండ ముంబైలో ఎక్కువగా ఉన్నాడు. ఆ టైం లో తరచుగా రష్మిక-విజయ్ దేవరకొండ ముంబైలో చక్కర్లు కొడుతూ కనిపించారు. డిన్నర్ నైట్స్ ఎంజాయ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కారు.
రెండు పర్యాయాలు మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. అక్కడ ఒకే రూమ్ లో వీరు ఉన్నారనడానికి ఆధారాలు దొరికాయి. విజయ్ దేవరకొండతో మీరు మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు కదా అని అడిగితే… అవును వెళ్ళాను. అందులో తప్పేమి ఉందని రష్మిక ఎదురు ప్రశ్నించారు. అతడు నా స్నేహితుడు. ఫ్రెండ్స్ వెకేషన్ కి వెళితే ఏమవుతుందని సమాధానం చెప్పింది.
విజయ్ దేవరకొండను ఆమె ప్రేమించింది అనడానికి మరొక కారణం… రష్మిక వారి ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు. విజయ్ ఇంట్లో జరిగే చిన్న చిన్న వేడుకలకు ఆమె ప్రత్యేకంగా హాజరవుతారు. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మెంబర్ మాదిరి మెలుగుతారు. తాజాగా దీపావళి వేడుకలు విజయ్ దేవరకొండ ఇంట్లో చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. విజయ్, రష్మిక ప్రేమలో ఉన్నారనడానికి ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరోసారి విజయ్ దేవరకొండ-రష్మిక వ్యవహారం తెరపైకి వచ్చింది.