క్రేజీ బ్యూటీ ‘రష్మిక మండన్నా’లో ఇంకా ఆ చిలిపితనం, అలాగే చిన్నపిల్లల చేష్టలు పోలేదు. లాక్ డౌన్ ఎత్తేశారు, షూటింగ్ లు కూడా మొదలయ్యాయి. కానీ కోవిడ్ తన ప్రభావాన్ని ఇంకా చూపిస్తూనే ఉంది. అందుకే, బయట అడుగు పెడితే మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందే అంటూ ప్రభుత్వం కఠిన నియమాలు పెట్టింది. అలాగే సోషల్ డిస్టెన్స్ కూడా తప్పక పాటించాల్సిందే అంటూ షరతులు విధించింది.
కానీ చాలామంది మాస్క్ పెట్టుకోవడం మర్చిపోతూ ఉంటారు, ఇప్పుడు ఈ కోవలోకి రష్మిక కూడా చేరింది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ డైరెక్టర్ల చుట్టూ చక్కర్లు కొడుతోంది. వరుస బాలీవుడ్ అవకాశాల కోసం తెగ ఆరాటపడుతుంది. ఈ క్రమంలో అన్ని బాలీవుడ్ సినిమా ఆఫీసుల చుట్టూ రౌండ్లు వేస్తోంది. నిన్న కూడా ముంబైలో ఒక సినిమా ఆఫీస్ కి వచ్చింది ఈ క్రేజీ బ్యూటీ.
అయితే రష్మిక కారు దిగి అలా నడుచుకుంటూ ఆఫీస్ లోకి ఎంటర్ అవుతూ ఉండగా, సడెన్ గా ఈ కుర్ర భామకు మాస్క్ గుర్తుకొచ్చింది. తాను మాస్క్ పెట్టుకోలేదని అర్థం చేసుకుంది. కానీ అంతలోనే ఎడాపెడా ఫోటోలు తీసి పడేసిన ఎదురుగా ఉన్న ఓ జర్నలిస్ట్ ఫోటోగ్రాఫర్ వైపు చూస్తూ మాస్క్ మర్చిపోయాను సారీ అంటూ ఓ క్షమాపణ కూడా చెప్పింది. వెంటనే కారు వైపు పరుగులు అందుకుని మాస్క్ తీసుకొని సిగ్గు పడుతూ తగిలించుకొంది.
ఇప్పుడు రష్మిక చేసిన ఈ మాస్క్ వ్యవహారం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే వీడియోని పరీక్షగా చూస్తే ఒక విషయం మాత్రం చాల స్పష్టంగా అర్థమవుతుంది. రష్మిక కావాలనే పొట్టి డ్రెస్సులతో వచ్చి, మాస్క్ లేకుండా ఫోటోలకు ఫోజులు ఇచ్చి, మళ్ళీ ఏదో మాస్క్ మర్చిపోయినట్టు కలరింగ్ ఇచ్చిందని అర్ధమవుతుంది. రష్మికలో ఇంకా ఆ అతి తెలివి తేటలు పోలేదు అన్నమాట.