Homeఎంటర్టైన్మెంట్OTT Releases: ఈ వారం OTT లో విడుదలయ్యే క్రేజీ కొత్త చిత్రాలు ఇవే..ఆడియన్స్ కి...

OTT Releases: ఈ వారం OTT లో విడుదలయ్యే క్రేజీ కొత్త చిత్రాలు ఇవే..ఆడియన్స్ కి పండగే!

OTT Releases: ప్రతీ వారం మూవీ లవర్స్ థియేటర్స్ విడుదలయ్యే సినిమాల కోసం మాత్రమే కాదు , ఓటీటీ లో విడుదలయ్యే సినిమాల కోసం కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఈ వారం కూడా ఎదురు చూస్తున్నారు. థియేటర్స్ లో ఒకపక్క ‘జైలర్ 2’ మూవీ విద్వంసం నడుస్తోంది. థియేటర్స్ కి వెళ్లి ఆ సినిమాని చూసే ఓపిక లేని వాళ్ళు , ఓటీటీ లో ఈ వారం కొత్త సినిమాలు ఏమైనా వచ్చాయా […]

OTT Releases: ప్రతీ వారం మూవీ లవర్స్ థియేటర్స్ విడుదలయ్యే సినిమాల కోసం మాత్రమే కాదు , ఓటీటీ లో విడుదలయ్యే సినిమాల కోసం కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఈ వారం కూడా ఎదురు చూస్తున్నారు. థియేటర్స్ లో ఒకపక్క ‘జైలర్ 2’ మూవీ విద్వంసం నడుస్తోంది. థియేటర్స్ కి వెళ్లి ఆ సినిమాని చూసే ఓపిక లేని వాళ్ళు , ఓటీటీ లో ఈ వారం కొత్త సినిమాలు ఏమైనా వచ్చాయా అని ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అలాంటోళ్లకు ఈ వారం పండగే అని చెప్పొచ్చు. నెట్ ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్, జియో హాట్ స్టార్ వంటి ఓటీటీ యాప్స్ లో మీకు ఇష్టమైన సినిమాలు ఈ వారం ఏవేవి రాబోతున్నాయి ఒకసారి చూద్దాం.

ముందుగా నేచురల్ స్థార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రం గురించి మనం మాట్లాడుకోవాలి. రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది. కానీ ఒక సెక్షన్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని బాగా ఇష్టపడ్డారు. అందుకే టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం 95 శాతానికి పైగా రీకవరీ చేసింది. ఫ్లాప్ టాక్ తో ఆ రేంజ్ రాబట్టేంత ఏముంది ఈ సినిమాలో అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు ఎదురు చూడాల్సిందే. ఈ నెల 22 నుండి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తెలుగు , తమిళం , హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో ఈ చిత్రాన్ని మనం చూడొచ్చు.

ఇక నెట్ ఫ్లిక్స్ విడుదల అవ్వబోయే మరో చెప్పుకోదగ్గ చిత్రం దొరతి. కీర్తి సురేష్ , రిషి కాంత్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ , కలెక్షన్స్ మాత్రం రాలేదు. కానీ ఓటీటీ ఆడియన్స్ కి మాత్రం కచ్చితంగా ఈ చిత్రం నచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 23 నుండి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో తెలుగు తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. అదే విధంగా గజబ్ రాత్ అనే బాలీవుడ్ చిత్రం , షాడోస్ ఆఫ్ ది టిన్ నింజా అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ , సర్వైవింగ్ హరికేన్ ఒటీస్ అనే ఇంగ్లీష్ చిత్రం కూడా నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 23 నుండి స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

ఇక జియో హాట్ స్టార్ విషయానికి వస్తే, ఈ వారం తెలుగు సినిమాలు చెప్పుకోదగినవి లేవనే చెప్పాలి. మోనా అనే ఇంగ్లీష్ సినిమా ప్రస్తుతానికి స్ట్రీమింగ్ అవుతోంది. ఇది తెలుగు లో కూడా అందుబాటులో ఉంది . అదే విధంగా హిందీ లో మహిషాశుర వథ్ అనే వెబ్ సిరీస్ ని దసరా కానుకగా విడుదల చేశారు. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా వరం అనే వెబ్ సిరీస్ ఈ నెల 22 నుండి స్ట్రీమింగ్ అవ్వబోతుండగా , ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ వెబ్ సిరీస్ సీజన్ 7 అక్టోబర్ 23 నుండి స్ట్రెమైన్గ్ కాబోతుంది.

ఇక అమెజాన్ ప్రైమ్ వీడియో లో కూడా చెప్పుకోదగినవి లేవు. రీసెంట్ గానే ‘ది టెర్మినల్ లిస్ట్ ‘ సీజన్ 2 వెబ్ సిరీస్ మొదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే విధంగా తేజ సజ్జ హోస్ట్ గా వ్యవహరించిన ‘ది ట్రైటర్స్’ రియాలిటీ షో కి సంబంధించి కొత్త ఎపిసోడ్స్ ని అప్లోడ్ చేశారు. అదే విధంగా చార్ యార్ అనే హిందీ వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఓవరాల్ గా ఈ వారం విడుదల అయ్యే సినిమాలు , వెబ్ సిరీస్ లు ఇవే. వీటిల్లో మీరు చూడాలని అనుకుంటున్నది ఏంటి ?, దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెం చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper