Ram Charan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఇక తన కొడుకు అయిన రామ్ చరణ్ (Ram Charan) సైతం చిరుత (Chirutha) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన మగధీర (Magadheera) సినిమాతో ఇండస్ట్రీ లో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేశాడు. ఇక ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో ఇండస్ట్రీలో ఒక గొప్ప నటుడిగా ఎదిగే ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాలో ఆయన పోషించిన పాత్రకు గాను ఆయనకు గొప్ప గుర్తింపు లభించడమే కాకుండా గ్లోబల్ స్టార్ (Global Star) అంటూ ఒక బిరుదును కూడా తెచ్చుకున్నాడు. మరి ఇలాంటి రామ్ చరణ్ మగధీర సినిమా తర్వాత ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదుగుతాడు అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లను చేసినప్పటికి ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలతో కొంతవరకు డల్ అయ్యాడు.
Also Read : రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో శివ రాజ్ కుమార్ పాత్ర ఎలా ఉండబోతుందంటే..?
రొటీన్ రెగ్యూలర్ సినిమాలు చేయడానికి ఆయన ఎక్కువగా ఆసక్తి చూపించడం వల్ల ఇండస్ట్రీలో సక్సెసులైతే వచ్చాయి. కానీ ఆయన సినిమాల మీద ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేకపోయారు. ఇక ఎప్పుడైతే ధృవ(Dhruva), రంగస్థలం (Rangasthlam) లాంటి సినిమాలు వచ్చాయో అప్పటి నుంచి రామ్ చరణ్ కొత్తదనాన్ని స్వీకరిస్తూ కొత్త సినిమాలు చేస్తూ కొత్త జానర్ లో మూవీస్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ వచ్చాడు.
అందువల్లే ఆయన సినిమాలకి ఎక్కువ గుర్తింపు లభించేది. ఇక ప్రస్తుతం ఆయన బుచ్చి బాబు డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ రికార్డులను కొల్లగొట్టాలనే ప్రయత్నంలోనే తను ఉన్నట్టుగా తెలుస్తోంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నీ బ్రేక్ అవుతాయా? అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఓకెత్తయితే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.
ఈ సంవత్సరం వచ్చిన గేమ్ చేంజర్ సినిమాతో భారీ డిజాస్టర్ ని మూట గట్టుకున్న రామ్ చరణ్ తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఆయన లాంటి స్టార్ హీరో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరనేది వాస్తవం…మరి తనను తాను మరోసారి నెంబర్ వన్ హీరోగా నిరూపించుకోవాల్సిన అవసరమైతే ఉంది. దానికి తగ్గట్టుగానే సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…