Borugadda Anil Kumar: తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో( fake papers ) బెయిల్ పొందారంటూ బోరుగడ్డ అనిల్ కుమార్ పై( Anil Kumar) ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తల్లికి అనారోగ్యంగా ఉందంటూ హైకోర్టులో బెయిల్ తీసుకొని.. ఆ తరువాత దాని పొడిగింపు కోసం ఫేక్ మెడికల్ సర్టిఫికెట్ సమర్పించి బోరుగడ్డ వేయి తీసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. బోరుగడ్డ గ్రేట్ ఎస్కేప్ అంటూ మీడియాలో సైతం పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బోరుగడ్డ అనిల్ కుమార్ ఈరోజు ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తాను ఎక్కడికి పారిపోలేదని పేర్కొంటూ అసలు విషయం వెల్లడించారు. దీంతో బోరుగడ్డ వ్యవహారంలో క్లారిటీ వచ్చింది.
Also Read: మెగా బ్రదర్ నాగబాబు ఆస్తులు ఎంతో తెలుసా? ఎన్ని కోట్లంటే?
* నాలుగు నెలలుగా ఇబ్బందులు..
గత నాలుగు నెలలుగా కూటమి ప్రభుత్వం తనపై కక్ష కట్టిందని బోరుగడ్డ అనిల్ కుమార్( boragadda Anil Kumar ) స్పష్టం చేశారు. ఫిబ్రవరి 14న మధ్యంతర బెయిల్ పై తాను బయటకు వచ్చానని తెలిపారు. తనకు అనంతపురం కోర్టులో బెయిల్ వస్తుందని తెలిసి కూటమి ప్రభుత్వం కుట్ర పన్ని .. తాను అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రచారం చేస్తుందన్నారు. తన ఆరోగ్యం బాగోలేదని.. తన తల్లికి సర్జరీ జరగడంతో హైకోర్టుకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఫిబ్రవరి 28న తాను జైల్లో లొంగిపోయానని.. మార్చి 3న తాను తిరిగి రిలీజ్ అయ్యానని తెలిపారు. ఐదుగురు చెల్లెల్లు ఉన్న తాను తన తల్లిని చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ వల్ల నాకు ప్రాణహాని ఉంది.. నన్ను వాళ్ళనుంచి కాపాడండి..
బోరుగడ్డ అనిల్ కుమార్ సెల్ఫీ వీడియో వైరల్!! #borugaddaanil #AndhraPradesh #RTV pic.twitter.com/zodru2ytRd
— RTV (@RTVnewsnetwork) March 8, 2025
* అన్ని విషయాలపై స్పష్టత..
అయితే ఫేక్ సర్టిఫికెట్లతో బెయిల్( bail ) పొందిన విషయంపై స్పష్టతనిచ్చారు అనిల్ కుమార్. అది కేవలం దుష్ప్రచారం అన్నారు. తాను జైల్లో ఉంటే ఫేక్ సర్టిఫికెట్ ఎలా పెడతానని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో లోకేష్, పవన్ లు తనకు శాశ్వతంగా బెయిల్ రాకుండా ఉండేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. తనకు ఏదైనా జరిగితే వారిదే బాధ్యత అని హెచ్చరించారు. వాస్తవాలు బయట పెట్టేందుకు ఈ వీడియో విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
* థర్డ్ డిగ్రీ ప్రయోగం..
పోలీస్ కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ( Third degree) ప్రయోగించిన విషయాన్ని ప్రస్తావించారు బోరుగడ్డ. తన వెన్నుపూస కూడా దెబ్బతిందని చెప్పుకొచ్చారు. పోలీసులు తనపై పెట్టిన సెక్షన్లు చెల్లవన్నారు. తాను ఎటువంటి తప్పు చేయలేదన్నారు. తనలాంటి పరిస్థితులు ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ కుటుంబాన్ని చంపాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ప్రయత్నిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తనకు ఏదైనా జరిగితే అందుకు ఆ ముగ్గురు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.
Also Read: అమరావతి పునర్నిర్మాణానికి ముహూర్తం ఫిక్స్.. అప్పటి నుంచే పనులు!