Homeఎంటర్టైన్మెంట్Ram Charan: రామ్ చరణ్ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న టాప్ డైరెక్టర్లు...

Ram Charan: రామ్ చరణ్ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న టాప్ డైరెక్టర్లు…

Ram Charan: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు స్టార్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోల క్రేజ్ అమాంతం తార స్థాయికి వెళ్ళిపోయింది. అందుకే రామ్ చరణ్ నుంచి రాబోయే సినిమాలు ఎలాంటి రికార్డులను బ్రేక్ చేయబోతున్నాయి అనే విషయాలను తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు వస్తున్న ‘పెద్ది’ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తూ 2000 కోట్లకు పైన […]

Ram Charan: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు స్టార్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోల క్రేజ్ అమాంతం తార స్థాయికి వెళ్ళిపోయింది. అందుకే రామ్ చరణ్ నుంచి రాబోయే సినిమాలు ఎలాంటి రికార్డులను బ్రేక్ చేయబోతున్నాయి అనే విషయాలను తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు వస్తున్న ‘పెద్ది’ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తూ 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది దర్శకులు సైతం పెద్ది సినిమా కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Also Read: హరీష్ శంకర్ డిస్ట్రిబ్యూటర్స్ కి డబ్బులు చెల్లించాల్సిందేనా…

ఎందుకంటే రామ్ చరణ్ ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్లను బ్రేక్ చేస్తే ఆయనతో ఒక 1000 కోట్లు లేదంటే 1500 కోట్లు బడ్జెట్ తో సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో కొంతమంది బాలీవుడ్ మేకర్స్ రెడీగా ఉన్నారట. ఇప్పటికే సంజయ్ లీలా భన్సాలీ సైతం ఒక భారీ ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు…ఆయన మార్కెట్ ఏ రేంజ్ లో ఉంది అనేది తెలుసుకొని సినిమాని ప్లాన్ చేయడానికి వాళ్ళు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.

ఇక ఇప్పటికే మహేష్ బాబుతో రాజమౌళి 1500 కోట్లతో వారణాసి సినిమాను చేస్తున్నాడు. రామ్ చరణ్ తో కూడా అది వర్కౌట్ అవుతుందా? లేదా అనే ధోరణిలో ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇక పెద్ది సినిమా అనేది రామ్ చరణ్ కి చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే ఆ సినిమా సక్సెస్ ని సాధిస్తేనే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ సైతం భారీ లెవెల్లో వర్కౌట్ అయ్యే విధంగా కనిపిస్తున్నాయి.

లేకపోతే మాత్రం చాలా వరకు డీలాపడిపోయే అవకాశాలైతే ఉన్నాయి. అలాగే రామ్ చరణ్ తో చేయాలనుకున్న ప్రాజెక్టులు సైతం వేరే హీరోల దగ్గరికి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి పెద్ది సినిమా సక్సెస్ అనేది రామ్ చరణ్ కి చాలా కీలకమనే చెప్పాలి…చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper