Homeఎంటర్టైన్మెంట్Harish Shankar: హరీష్ శంకర్ డిస్ట్రిబ్యూటర్స్ కి డబ్బులు చెల్లించాల్సిందేనా...

Harish Shankar: హరీష్ శంకర్ డిస్ట్రిబ్యూటర్స్ కి డబ్బులు చెల్లించాల్సిందేనా…

Harish Shankar: ఒక సక్సెస్ ఫుల్ సినిమా చేస్తే దర్శకుడికి ఎంత గొప్ప గుర్తింపు వస్తుందో ఒక ఫెయిల్యూర్ సినిమా చేసినప్పుడు చాలా దారుణమైన విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక డిస్ట్రిబ్యూటర్స్ అయితే వాళ్లు సినిమాని కొన్న డబ్బులు కూడా రాకపోతే సినిమా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ల మీద కంప్లైంట్ చేస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే దర్శక నిర్మాతలు కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితైతే ఏర్పడుతుంది. గతంలో చాలామంది హీరోలు, దర్శకులు సినిమా డిజాస్టర్ అయినప్పుడు వల్ల రెమ్యూనరేషన్ […]

Harish Shankar: ఒక సక్సెస్ ఫుల్ సినిమా చేస్తే దర్శకుడికి ఎంత గొప్ప గుర్తింపు వస్తుందో ఒక ఫెయిల్యూర్ సినిమా చేసినప్పుడు చాలా దారుణమైన విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక డిస్ట్రిబ్యూటర్స్ అయితే వాళ్లు సినిమాని కొన్న డబ్బులు కూడా రాకపోతే సినిమా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ల మీద కంప్లైంట్ చేస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే దర్శక నిర్మాతలు కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితైతే ఏర్పడుతుంది. గతంలో చాలామంది హీరోలు, దర్శకులు సినిమా డిజాస్టర్ అయినప్పుడు వల్ల రెమ్యూనరేషన్ ను తిరిగి వెనక్కి ఇచ్చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఈ లెక్కన ఇప్పుడు హరీష్ శంకర్ సైతం తన డైరెక్షన్లో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడం డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టాన్ని చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మన నష్టం లో ఎంతో కొంత తను భర్తీ చేసే అవకాశం ఉంది అంటూ కొంతమంది సినిమా మేధావులు చెబుతున్నారు.

ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ కి ఇంకోసారి మనం చేసే సినిమాలను వాళ్లు కొనుగోలు చేయరు. కాబట్టి వారిని ఎప్పుడు ఎంతో కొంత నష్టాల్లో పాలుపంచుకోవాల్సిన పరిస్థితైతే ఉంది. అందుకే నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూ ఉంటారు… ఇక ఈ సినిమా పవన్ కళ్యాణ్ రేంజ్ సినిమా కాదంటూ చాలామంది కొట్టి పడేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు హరీష్ శంకర్ కి చాలా గడ్డు పరిస్థితి నడుస్తుందనే చెప్పాలి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో చిరంజీవి – బాలయ్య బాబు ఇద్దరూ కూడా అతనితో సినిమా చేయాలనుకున్నప్పటికి వాళ్ళు ఎవరు ఇప్పుడు ఆసక్తి చూపించడం లేదట. ఇక దానికి తోడుగా డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలు వచ్చాయి. కాబట్టి తన రెమ్యూనరేషన్ ని వెనక్కి ఇచ్చేస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఏది ఏమైనా కూడా హరీష్ శంకర్ ఈ మధ్య పూర్తిగా తన ఫామ్ ను కోల్పోయాడు…రాబోయే సినిమాలతో తన సత్తా చాటుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper