spot_img
Homeఎంటర్టైన్మెంట్Ram Charan: వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన రామ్ చరణ్ 'ఇండియా హౌస్'.. ఫ్యాన్స్ కూడా...

Ram Charan: వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన రామ్ చరణ్ ‘ఇండియా హౌస్’.. ఫ్యాన్స్ కూడా తిడుతున్నారుగా!

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎలాంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఎంజాయ్ చేస్తున్నాడో అందరికీ తెలిసిందే. #RRR చిత్రం తో ఆయన చూసిన ఉన్నత శిఖరాలు టాలీవుడ్ లో ఏ హీరో కూడా చూసి ఉండదు. తనకి వచ్చిన ఈ అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు సరిగ్గా ఉపయోగించుకొని ముందుకు పోవాలని చూస్తున్న రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే చిత్రం చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశలో ఉంది, ఈ సినిమా తర్వాత ఆయన ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఇది కూడా రంగస్థలం తరహా చిత్రమట. ఇదంతా పక్కన పెడితే రామ్ చరణ్ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా, నిర్మాతగా కూడా గత కొంతకాలం నుండి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ‘కొణిదెల ప్రొడక్షన్స్’ అనే సంస్థ ని స్థాపించి తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి తో సినిమాలు చేసాడు.

అయితే ఇప్పుడు రామ్ చరణ్ మళ్ళీ సెపెరేట్ గా యూవీ క్రియేషన్స్ విక్రమ్ తో కలిసి V మెగా పిక్చర్స్ అనే సంస్థ ని రీసెంట్ గానే ప్రారంభించాడు. ఈ సంస్థ నుండి మొదటి చిత్రం గా ఫ్రీడమ్ ఫైటర్ వీర్ సవర్కర్ బయోపిక్ ని తియ్యబోతున్నాడు. యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న ఈ చిత్రానికి ‘ఇండియా హౌస్’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. నిన్ననే ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ని విడుదల చేసారు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.అయితే ఎప్పుడైతే ఆయన ఈ ప్రకటన చేసాడో అప్పటి నుండి సోషల్ మీడియా లో నెగటివిటీ విపరీతంగా పెరిగిపోయింది.

సొంత అభిమానులు కూడా రామ్ చరణ్ ని తిట్టడం ప్రారంభించారు. ఎందుకంటే వీర్ సవర్కర్ అనే వ్యక్తిని ఫ్రీడమ్ ఫైటర్ కంటే కూడా దేశద్రోహి అని నమ్మేవాళ్ళు ఎక్కువ, కానీ బీజేపీ పార్టీ మాత్రం వీర్ సవర్కర్ ని ఒక ఫ్రీడమ్ ఫైటర్ అన్నట్టుగా చూపించిందని కొంతమంది ఆరోపణ,మరి భవిష్యత్తులో ఈ నెగటివిటీ ని రామ్ చరణ్ ఎలా ఛేదిస్తాడు అనేది చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper