Rakasa 15 days collections: ఈమధ్య కాలంలో విడుదలైన చిత్రాల్లో ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్న చిత్రాల్లో ఒకటి ‘రాకాస'(Rakasa Movie). ‘మ్యాడ్’ సిరీస్ తర్వాత సంగీత్ శోభన్(Sangeeth Sobhan) హీరో గా నటించిన ఈ సినిమా పై మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టు మూవీ టీం మొత్తం ప్రొమోషన్స్ లో పాల్గొన్నది. ఇక ఈ చిత్రానికి నిహారిక కొణిదెల నిర్మాత అవ్వడం తో , మెగా ఫ్యామిలీ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి వారితో కూడా ప్రమోట్ చేయించింది. అలా మంచి పాజిటివ్ బజ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా, మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని కూడా సొంతం చేసుకుంది. ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి కానీ , లాంగ్ రన్ లో మాత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి నానా తిప్పలు పడుతుంది ఈ చిత్రం.
15 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి , ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం. నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రానికి 15 రోజుల్లో 4 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా , సీడెడ్ ప్రాంతం నుండి 1 కోటి 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , ఆంధ్ర ప్రదేశ్ నుండి 3 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 15 రోజుల్లో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 9 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 91 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , ఓవర్సీస్ నుండి 2 కోట్ల 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 12 కోట్ల 46 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 24 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
విడుదలకు ముందు ఈ చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 13 కోట్ల 50 లక్షల రూపాయిలు. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ హిట్ స్టేటస్ ని అందుకోవాలంటే మరో 1 కోటి 4 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రావాల్సి ఉంది. ఇక ఎంతొచ్చిన ఈ వీకెండ్ లోనే రావాలి , ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రన్ దాదాపుగా ఐపోయినట్టే. కాబట్టి ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ మార్కు కి అతి చేరువగా వెళ్లి, 50 లక్షల లాస్ ని మిగిలించి సెమీ హిట్ గా ఈ చిత్రం మిగిలే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు