Homeఎంటర్టైన్మెంట్ఆ నవ్వుల హీరోని ఏడిపించింది వాళ్లే !

ఆ నవ్వుల హీరోని ఏడిపించింది వాళ్లే !

అదేంటో నలుగురిని నవ్వించే వాళ్ళ జీవితంలోనే విషాదాలు ఎక్కువ ఉంటాయి. హీరో రాజేంద్ర‌ప్ర‌సాద్ వెండితెర‌ పై నవ్వులు పూయించిన హీరో. మూడు జనరేషన్ ప్రేక్ష‌కుల‌కు ఆనందాన్ని పంచిన హీరో. ఒక దేశ ప్రధానమంత్రిని అభిమానిగా మలుచుకున్న హీరో. పైగా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో రాజేంద్ర‌ప్ర‌సాద్‌ ది విశిష్ట స్థానం. అయితే, ఆ మధ్య రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో త‌న జీవితంలో చోటు చేసుకున్న చేదు సంఘటనలను బయట పెట్టడం నిజంగా అందర్నీ షాక్ కి గురి చేసింది. ఆయన […]

Rajendra Prasadఅదేంటో నలుగురిని నవ్వించే వాళ్ళ జీవితంలోనే విషాదాలు ఎక్కువ ఉంటాయి. హీరో రాజేంద్ర‌ప్ర‌సాద్ వెండితెర‌ పై నవ్వులు పూయించిన హీరో. మూడు జనరేషన్ ప్రేక్ష‌కుల‌కు ఆనందాన్ని పంచిన హీరో. ఒక దేశ ప్రధానమంత్రిని అభిమానిగా మలుచుకున్న హీరో. పైగా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో రాజేంద్ర‌ప్ర‌సాద్‌ ది విశిష్ట స్థానం.

అయితే, ఆ మధ్య రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో త‌న జీవితంలో చోటు చేసుకున్న చేదు సంఘటనలను బయట పెట్టడం నిజంగా అందర్నీ షాక్ కి గురి చేసింది. ఆయన మ‌న‌సులో ఇన్నాళ్లు ఇంత బాధ‌ ఉందని ఎవ్వరూ ఊహించలేదు. రాజేంద్రప్రసాద్ దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వచ్చాడు. అందుకే మొదటి నుండి డబ్బు విషయంలో ఆయన చాల జాగ్రత్తగా ఉండేవాడు.

కానీ సినిమాల బిజీలో పడి ఆయన ఆర్ధిక విషయాలన్నిటికీ తన వాళ్ళ పై ఆధారపడ్డారు. అప్పుడు అలా చేయడమే, ఇప్పటికీ ఆయనను ఓ బాధ వ్య‌క్తిగ‌తంగా వెంటాడుతుంది. ఆ సమయంలో ఆయన కుటుంబంతో కలిసి ఉన్న అతి దగ్గర బంధువులే, ఆ తరువాత కాలంలో రాజేంద్రప్రసాద్ ను మోసం చేశారట. ఆ మోసం చేసిన బంధువు వరుసకు ఆయనకు కూతురు అవుతారని తెలుస్తోంది.

త‌న అనుకున్న వాళ్ల ద‌గ్గ‌రే డ‌బ్బు విష‌యంలో తాను మోస‌పోవ‌డం రాజేంద్రప్రసాద్ ఇంకా జీర్ణయించుకోలేకపోతున్నారు. ఈ విషయం ఆయనకు తీవ్రమైన ఆవేద‌నను క‌లిగించింది. తన కెరీర్ లో సంపాదించిన దానిలో ఎక్కువ సొమ్మును ఆయన పోగొట్టుకున్నారు. అయితే, ఆ తరువాత కాలంలో వరుస సినిమాలు చేసి, రాజేంద్రప్రసాద్ ఆర్ధికంగా మళ్ళీ నిలబడ్డారు. కాకపోతే ద‌గ్గ‌రి వాళ్ల చేతిలో తాను మోసపోయాన‌నే చేదు నిజాన్ని ఆయన తీసుకోలేకపోతున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper