Homeఎంటర్టైన్మెంట్సీనియర్ హీరో ఆశలన్నీ దాని పైనే !

సీనియర్ హీరో ఆశలన్నీ దాని పైనే !

‘రాజశేఖర్’ యాంగ్రీ మ్యాన్ గా ఉన్న రోజుల్లో సమయానికి షూటింగ్ కి వచ్చేవాడు కాదు. సినిమా ప్రమోషన్స్ లో అయితే అసలు కనిపించడమే గగనం అయిపోయేది. మొత్తానికి నిర్మాతలకు చుక్కలు చూపించేవాడు. కాలం మారింది. కుర్ర హీరోలు ఎక్కువైపోయారు. రాజశేఖర్ లాంటి హీరోలకు డిమాండ్ పోయింది. దాంతో జగపతిబాబు, శ్రీకాంత్ లాంటి హీరోలు సైలెంట్ గా సైడ్ క్యారెక్టర్స్ కోసం తాపత్రయ పడుతున్నారు. ఇలాంటి స్థితిలో కూడా రాజశేఖర్ హీరోగానే సినిమాలు చేయడానికి కిందామీదా పడుతున్నాడు. అయితే, […]

Shekar movie‘రాజశేఖర్’ యాంగ్రీ మ్యాన్ గా ఉన్న రోజుల్లో సమయానికి షూటింగ్ కి వచ్చేవాడు కాదు. సినిమా ప్రమోషన్స్ లో అయితే అసలు కనిపించడమే గగనం అయిపోయేది. మొత్తానికి నిర్మాతలకు చుక్కలు చూపించేవాడు. కాలం మారింది. కుర్ర హీరోలు ఎక్కువైపోయారు. రాజశేఖర్ లాంటి హీరోలకు డిమాండ్ పోయింది. దాంతో జగపతిబాబు, శ్రీకాంత్ లాంటి హీరోలు సైలెంట్ గా సైడ్ క్యారెక్టర్స్ కోసం తాపత్రయ పడుతున్నారు.

ఇలాంటి స్థితిలో కూడా రాజశేఖర్ హీరోగానే సినిమాలు చేయడానికి కిందామీదా పడుతున్నాడు. అయితే, రాజశేఖర్ కోసం కథలు రాసేవాళ్ళు ఎవరు లేరు. దాంతో రీమేక్ ల మీద పడ్డాడు ఈ సీనియర్ హీరో. నిజానికి రాజశేఖర్ కి రీమేక్ రాజా అనే పేరు కూడా ఉంది లేండి. ఇప్పటికే రాజశేఖర్ చాలా రీమేక్ లు చేశారు. చాలా గ్యాప్ తర్వాత ఆయన మరో రీమేక్ చేస్తున్నాడు.

రాజశేఖర్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ… శేఖర్. ఈ సినిమా ఒక థ్రిల్లర్ మూవీ అని తెలుస్తోంది. మలయాళంలో సూపర్ హిట్టయిన ఒక క్రైం అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆధారంగా ఈ ‘శేఖర్’ మూవీ రాబోతుంది. అయితే వచ్చే వారం నుండి ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలు కానుంది. ఈ సినిమాలో అను సితార, ముస్కాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

రాజశేఖర్ కి ఇప్పుడు తప్పనిసరిగా హిట్ కావాలి కాబట్టి, ఈ సినిమా కోసం ఏమైనా చేస్తాను అంటున్నాడు ఈ హీరో. ‘గరుడవేగ’ వల్ల వచ్చిన క్రేజ్ ఆ తర్వాత విడుదలైన ‘కల్కి’తో హుష్ కాకి అయిపోవడంతో రాజశేఖర్ పరిస్థితి ప్రస్తుతం బాగాలేదు. అందుకే, ఈ శేఖర్ సినిమా పైనే ఆశలు అన్ని పెట్టుకున్నాడు. ఈ సినిమా అవుట్ ఫుట్ పై గట్తి నమ్మకంతోనే ఉన్నాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper