Homeఎంటర్టైన్మెంట్Pushpaka Vimanam: ఆనంద్ దేవరకొండ " పుష్పక విమానం" ట్రైలర్ రిలీజ్ చేసిన... అల్లు అర్జున్

Pushpaka Vimanam: ఆనంద్ దేవరకొండ ” పుష్పక విమానం” ట్రైలర్ రిలీజ్ చేసిన… అల్లు అర్జున్

Pushpaka Vimanam: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాడు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చాడు ఈ యంగ్ హీరో. ఈ మూవీలో హీరోయిన్ గా హీరో రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. కానీ వీరి నటనతో మాత్రం ప్రేక్షకుల్లో మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత  మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు ఆనంద్. ప్రస్తుతం కొత్త దర్శకుడు దామోదర తెరకెక్కిస్తున్న ” పుష్పక విమానం ” అనే సినిమాలో నటిస్తున్నాడు ఆనంద్. ఈ సినిమాను కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్స్ మరియు టామ్ గా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.

pushpaka vimanam movie trailer released by icon star allu arjun

ఈ సినిమా ట్రైలర్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్ లకు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించగా… ఈ ట్రైలర్ తో మూవీ పట్ల అంచనాలను పెంచేశారు అనే చెప్పాలి. పుష్పక విమానం సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన రెండు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదల చేయడంతో సినిమా ఇప్పుడు మరో రేంజ్ కు వెళ్లిందని చెప్పాలి.

పెళ్లయిన తర్వాత భార్య వేరొకరితో వెళ్ళిపోతే ఆ యువకుడు పడే అవస్థలను ఈ సినిమాలో చూపించినట్లు తెలుస్తుంది. ఈ  ట్రైలర్ ను పరిశీలిస్తే  ఆనంద్ దేవరకొండ మరోసారి తన నటనతో మ్యాజిక్ చేసేలా ఉన్నట్లు కనబడుతుంది. విజువల్స్, మ్యూజిక్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అని చెప్పాలి.

 

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper