Bobby Simha: ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం లో ప్రకాష్ రాజ్ తమ్ముడిగా నటించిన బాబీ సింహా గురించి సోషల్ మీడియా ని ఉపయోగించే నెటిజెన్స్ కి తెలియకుండా ఉండదు. ఎందుకంటే ఈయన నేషనల్ అవార్డు గ్రహీత, ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోని ఎన్నో అబ్దుతమైన క్యారెక్టర్స్ చేశాడు. పాన్ ఇండియా లెవెల్ లో క్యారక్టర్ ఆర్టిస్టుగా విపరీతమైన డిమాండ్ ఉన్న నటులలో ఒకడు. ఈయన ఒక సినిమాలో ఉంటే ఆ సినిమాకే కొత్త బలం వస్తుంది. తెలుగు లో ఇప్పటి వరకు ఈయన ‘వాల్తేరు వీరయ్య’, ‘డిస్కో రాజా’, ‘సలార్’ వంటి చిత్రాలు చేశాడు. ఈ మూడు సినిమాల ఫలితాలేంటో మనకి తెలుసు. అదే విధంగా తమిళం లో ఈయన ప్రధాన పాత్ర పోషించిన ‘జిగార్తాండ’ చిత్రాన్ని తెలుగు లో మన వరుణ్ తేజ్ ‘గద్దల కొండ గణేష్’ గా రీమేక్ చేసి సూపర్ హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమాకే ఆయన నేషనల్ అవార్డు అందుకుంది.
ఇదంతా పక్కన పెడితే బాబీ సింహా సోదరి కూడా సౌత్ లో పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసిందని, ప్రస్తుతం ఆమె తమిళం లో మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్ అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా..?, ఆమె పేరు రేష్మ పసుపులేటి. ఈమె బాబీ సింహా కి కజిన్ సిస్టర్ అవుతుంది. తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువే, కానీ తమిళంలో ఈమె సినిమాలు, సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించింది. తెలుగు లో ఈమె ఆనంద్ దేవరకొండ హీరో గా నటించిన హైవే అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో పాటు తెలుగు లో ఆమె రెండు వెబ్ సిరీస్ లు కూడా చేసింది. రేష్మ కేవలం తన అన్నయ్య పేరు చెప్పుకొని ఇండస్ట్రీ లోకి ఎదగాలనే ఉద్దేశ్యంతో రాలేదు. తన టాలెంట్ ని నిరూపించుకొనే సినిమాల్లో అవకాశాలు సంపాదించింది.
తమిళ బిగ్ బాస్ రియాలిటీ షోలో ఈమె ఒక కంటెస్టెంట్ గా పాల్గొని సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఈమె ఏకంగా 20 టీవీ సీరియల్స్ లో హీరోయిన్ గా, విలన్ గా ఇలా ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించి సెన్సేషన్ సృష్టించింది. చూసేందుకు హాట్ హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోని ఈమె, కేవలం అందాల ఆరబోతల పరిమితం కాకుండా, తన అన్నయ్య లాగానే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషిస్తూ విలక్షణ నటిగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. తెలుగులో కూడా ఈమెకు అవకాశాలు వస్తున్నాయి కానీ, తమిళం లో ఫుల్ బిజీ గా ఉండడం వల్ల ఇక్కడ డేట్స్ కేటాయించలేకపోతుంది. పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తే కచ్చితంగా ఈమె తన అన్నయ్య లాగానే తిరుగులేని గుర్తింపుని తెచ్చుకుంటుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆమె ఆ రేంజ్ కి వెళ్తుందో లేదో చూడాలి.
