Pushpa: ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో బన్నీ ఓ పల్లెటూరి మొరటోడి లుక్‌లో కనిపించనున్నారు. సుకుమార్ తొలిసారి పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తోన్న సినిమా ఇది. ఇందులో రష్మిక హీరోయిన్గా కనిపించనుంది. అయితే, ఇటీవల ఈ సినిమాలోని ఐటెం సాంగ్‌లో సమంత నటించనుందంటూ.. నెట్టింట వార్తలు వినిపించాయి. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ పుష్ప మేకర్స్ కూడా అనౌన్స్ చేశారు. సమంత పుష్పలో నటిస్తోందంటూ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. దీంతో సినిమాలోని ఐటెం సాంగ్‌పై మరింత ఆసక్తి పెరిగింది.
samantha
మరోవైపు ,ఈ పాట కోసం సమంత భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 1.5 కోట్లు సమంత తీసుకుంటున్నట్లు సమాచారం. సౌంత్ ఇండియాలోనే ఈ రెమ్యునరేషన్ రికార్డుగా తెలుస్తోంది. కాగా, ఈ పాట కోసం ప్రత్యేకంగా వేసిన సెట్లో నవంబరు 28నుంచి షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు, ఈ పాట కోసం సామ్ రిహార్సల్స్ కూడా ప్రారంభించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పుష్ప ఐటెం సాంగ్ కోసం ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా.. తొలి భాగాన్ని డిసెంబరు 17వ విడుదల చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. మరి అనుకున్న అంచనాలను చేరుకుంటుదో లేదో చూడాలి.