Jagan comments Pawan Kalyan: గత కొంతకాలం నుండి ‘పుష్ప 2′(Pushpa 2 Movie) చిత్రం లోని రప్పా రప్పా డైలాగ్ చుట్టూ ఎలాంటి రాజకీయాలు జరుగుతున్నాయో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. సత్తెనపల్లి లో జగన్(Ex CM Jagan) పర్యటన సమయంలో కార్యకర్తలు కూటమి ని బెదిరించే విధంగా ఫ్లెక్సీలను చేతిలో పెట్టుకొని తిరగడం తో, పోలీసులు వారిని అరెస్ట్ చేసి కస్టడీ లోకి తీసుకున్నారు. ఈ ఘటన జరిగిన కొత్తల్లో జగన్ ప్రెస్ మీట్ పెట్టి అందులో తప్పేమి ఉందంటూ వ్యాఖ్యానించాడు. నేడు కాసేపటి క్రితమే ఆయన మరోసారి ప్రెస్ మీట్ పెట్టి వివిధ అంశాలపై కూటమి ప్రభుత్వం వైఖరి పై మండిపడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. మరోసారి ఆయన అరెస్ట్ కాబడిన తన కార్యకర్తల గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.
Also Read: 3 ఏళ్లలో టీడీపీని దించి అధికారంలోకి.. అసలు జగన్ ధీమా ఏంటి?
జగన్ మాట్లాడుతూ ‘సినిమా డైలాగ్స్ ని పోస్టర్స్ లో పెట్టినందుకు ఇద్దరినీ రిమాండ్ లోకి పంపారు. మీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డు అలాంటి డైలాగ్స్ కి ఎందుకు అనుమతి ఇవ్వాలి?,ఆ డైలాగ్స్ ని తీసి వేయించాల్సింది. ఇంకా ఆ బాలకృష్ణ(Nandamuri Balakrishna) సినిమాలు, పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగ్స్ కనిపిస్తాయి. ఒక సినిమాలో డైలాగ్ హిట్ అయితే బయట వాడడం సహజం, వాటి మీద అభ్యంతరం ఎందుకు. అలాంటప్పుడు సినిమాలు ఎందుకు తీయడం, ఆపేయండి,మనం ప్రజాస్వామ్య రాష్ట్రము లోనే ఉన్నామా?’ అంటూ జగన్ కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు. దీనిపై సోషల్ మీడియా లో తీవ్రమైన విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు ఏకిపారేస్తున్నారు. జగన్ అసలు మతి ఉండే మాట్లాడుతున్నారా?, ఇప్పటికీ తప్పుని సమర్దిమ్చుకుంటూ వస్తున్నారు అంటూ మండిపడుతున్నారు.
Also Read: 150 అనాధాశ్రమాలను దత్తత తీసుకున్న మెగా కోడలు ఉపాసన కొణిదెల!
సినిమాలోని డైలాగ్స్ కొడితే తప్పు లేదు, కానీ అక్కడ ఎలాంటి బ్యానర్స్ పెట్టుకొని తిరగారంటే ‘2029 లో మళ్ళీ మేమే అధికారం లోకి వస్తాము. వచ్చిన వెంటనే ప్రతీ ఒక్కరిని జాతర లో తలలు నరికినట్టు రప్పా..రప్పా నరుకుతాము ఒక్కొక్కడిని’ అనే డైలాగ్ ఉంది. ఇది సినిమా డైలాగ్ లాగా అనిపిస్తుందా?, లేకపోతే వార్నింగ్ లాగా అనిపిస్తుందా?, పైగా ఈ ఫ్లెక్సీలు పట్టుకొని తిరిగిన ప్రాంతం ఎక్కడో కాదు, పల్నాడు జిల్లా. నడిరోడ్డు మీద ఒకరిని ఒకరు కనికరం లేకుండా నరుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నికల సమయం లో జరిగిన విద్వంసాన్ని అంత తేలికగా ఎవరైనా మర్చిపోగలరా?, ఒకరిపై ఒకరు నాటు బాంబులు వేసుకున్న పరిస్థితిలు ఉండేవి అప్పట్లో. తప్పుడు మార్గం లో వెళ్తున్న తన కార్యకర్తలను అదుపులో పెట్టాల్సింది పోయి, ఇలా వాళ్లకు మద్దతు తెలుపుతూ జగన్ ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని, ఇది భవిష్యత్తులో అనర్థాలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సినిమా డైలాగులు పోస్టర్లు వేస్తే తప్పేంటి?
మీకు ఆ సినిమా డైలాగులు అభ్యంతరంగా ఉంటే సెన్సార్ వాళ్లకు చెప్పి తీయించండి.. సెన్సార్ వాళ్ళు ఉన్నది దేనికి?
ఇంకా ఆ #PavanKalyan, #Balakrishna సినిమాల్లో అయితే డైలాగులు ఇంకా భయంకరంగా ఉంటాయి – మాజీ సీఎం @ysjagan pic.twitter.com/01AD14Kqw1
— greatandhra (@greatandhranews) July 16, 2025