Sukumar Movies Analysis: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళలో సుకుమార్(Sukumar)ఒకరు… ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి మంచి గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సైతం అతన్ని స్టార్ డైరెక్టర్ గా నిలబెట్టింది. ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టి బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేయడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాడు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ తో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అయితే కెరియర్ మొదట్లో సుకుమార్ చాలా ఐక్యూ లెవల్ ను చూపిస్తూ సినిమాలను చేసేవాడు ఆయన సినిమాల్ని ఒకసారి చూస్తే అర్థమయ్యేవి కావు. అందులో డిటెలింగ్ అనేది చాలా డెప్త్ గా ఉండేది. ఒకసారి చూసి దానిని డీటైలింగ్ ప్రకారం అర్థం చేసుకోవాలంటే సమయం పట్టేది. ఇక వన్ నేనొక్కడినే సినిమాతో ఆయన ఐక్యు లేబుల్ అనేది టాప్ రేంజ్కి వెళ్ళిపోయింది. సగటు ప్రేక్షకుడు అతని ఐక్యూ ను పట్టుకోవాలంటే చాలా కష్టం…
Also Read: రామ్ చరణ్ – లోకేష్ కనకరాజ్ కాంబోలో సినిమా వస్తే రికార్డులు బ్రేక్ అవుతాయా..?
ఈ సినిమా బాలేదు డిజాస్టర్ అయింది అని చెప్పడంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి నా సినిమాని అర్థం చేసుకునేంత నాలెడ్జ్ ప్రేక్షకులకు లేదు అంటూ ఒక కామెంట్ అయితే చేశాడు. దాంతో ప్రేక్షకులు సైతం అతని మీద కొంత వరకు విమర్శలు అయితే చేశారు. మరి ఏది ఏమైనా కూడా ఆ తర్వాత తన ఐక్యూ లెవల్ ను కొంతవరకు తగ్గించుకొని నాన్నకు ప్రేమతో సినిమా చేశాడు.
ఈ సినిమా బాగా ఆడింది ఇక ఆ తర్వాత మొత్తం ఫార్మాట్ మార్చేసి కమర్షియల్ సినిమాలను చేయాలనే ఉద్దేశ్యంతో ఒక మాస్ మసాలా సినిమాని చేయాలని రంగస్థలం సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాడు… ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ తో పుష్ప, పుష్ప 2 సినిమాలను చేసి పెను రికార్డులను క్రియేట్ చేశాడు.
Also Read: ‘కూలీ’తో లోకేష్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ అవుతాడా..?
నిజానికి ప్రేక్షకులకు అర్థమయ్యే సినిమాలు మాత్రమే చేయాలని, మనం డెప్త్ గా ఆలోచించి సినిమాలు చేసిన కూడా అవి ప్రేక్షకుడి కి రీచ్ అవ్వవని ఆయన చాలా లేటుగా తెలుసుకున్నానని చెప్పాడు. అందుకే కమర్షియల్ సినిమాలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నానని చెబుతూ ఉండటం విశేషం… రామ్ చరణ్ తో చేయబోతున్న సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేసే పనిలో సుకుమార్ ఉన్నాడు…