Pushpa : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) నటించిన ‘పుష్ప'(Pushpa Movie) చిత్రం వయస్సు తో సంబంధం లేకుండా ఆడియన్స్ అందరినీ ఏ రేంజ్ లో అలరించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు ఈ సినిమా లోని అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని అనుసకరించేవాళ్లే. బహుశా అల్లు అర్జున్ కి తన ఇమేజ్ ని తదుపరి సినిమాతో మార్చుకోవడం కత్తి మీద సాము లాంటిది. ఈ సవాల్ ని ఆయన ఎలా అధిగమిస్తాడో చూడాలి. ‘పుష్ప’ చిత్రానికి కేవలం ఇండియన్ ఆడియన్స్ లో మాత్రమే కాదు, ఇతర దేశాల్లోని ఆడియన్స్ కి కూడా తెగ నచ్చేసింది. అందుకు ఉదాహరణలు ఈమధ్య కాలంలో ఎన్నో మనం చూసాము. క్రికెటర్స్, ఫుట్ బాల్ ప్లేయర్స్ కూడా పుష్ప మ్యానరిజమ్స్ ని అనుకరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.
Also Read : ‘పుష్ప 2’ కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇన్నాళ్లకు విషయం బయటపెట్టిన థమన్ ?
అయితే రీసెంట్ గా అమెరికా లోని ఒక ప్రాంతం ఇండియా భవన్ అనే రెస్టారంట్ ఉంది. ఈ రెస్టారంట్ బయట పుష్ప చిత్రం లోని అల్లు అర్జున్ గెటప్ తో ఒక బొమ్మ చేతులు ఊపుతూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో ని తమిళం లో అత్యంత పాపులారిటీ సంపాదించిన ఒక రివ్యూయర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియో ని చూసి అల్లు అర్జున్ అభిమానులు కామెంట్స్ చేస్తూ ‘పుష్ప మేనియా ఇప్పట్లో తగ్గేది కాదు. ఒక జెనరేషన్ మొత్తాన్ని ఈ చిత్రం ప్రభావితం చేసింది..అల్లు అర్జున్ అభిమానులం అయ్యినందుకు గర్విస్తున్నాము’ అంటూ ఫ్యాన్స్ పెట్టిన పోస్టులు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే పుష్ప చిత్రం లో అద్భుతమైన నటన కనబర్చినందుకు గానూ, అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చింది.
Also Read : పుష్ప 2′ మొత్తం మాయేనా..? ఇదేమి ట్విస్ట్ బాబోయ్..సంచలనం రేపుతున్న వీడియో!
ఇక ‘పుష్ప 2’ కి కూడా నేషనల్ అవార్డు వస్తుందో లేదో చూడాలి. ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ ప్రస్తుతం తన తదుపరి చిత్రాన్ని తమిళ డైరెక్టర్ అట్లీ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 9 న ఆయన పుట్టినరోజు సందర్భంగా, ఈ సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ వీడియో ని కూడా విడుదల చేశారు. కేవలం స్పెషల్ వీడియో తోనే ఆడియన్స్ లో విపరీతమైన క్యూరియాసిటీ ని పెంచేసింది ఈ చిత్రం. ఇక టీజర్, లేదా ఫస్ట్ లుక్ విడుదల సమయం లో ఏ రేంజ్ మేనియా ఉంటుందో ఇప్పటి నుండే ఊహించుకోవచ్చు. ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఒక పాత్ర హీరో పాత్ర కాగా, మరో పాత్ర విలన్ అట. విలన్ గా ఆయన లుక్స్ కనీవినీ ఎరుగని రేంజ్ లో ఉంటాయని టాక్. హీరోయిన్స్ గా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, దిశా పటాని నటించబోతున్నారట.
Pushparaj in USA pic.twitter.com/lxtuVN37Mn
— Christopher Kanagaraj (@Chrissuccess) May 12, 2025