Peddi : ప్రస్తుతం మన టాలీవుడ్ నుండి తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రంపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. మొదటి నుండి ఈ సినిమాకు అటు ఫ్యాన్స్ లో, ఇటు ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది. ఎందుకంటే ఇది గ్రామీణ నేపథ్యం లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా, ఈ జానర్ లో సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి. ఆ తక్కువ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాలుగా నమోదు చేసుకున్నాయి. పైగా రామ్ చరణ్ ఇందులో ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నాడు. చరణ్ ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నాడంటే కచ్చితంగా ఆ సినిమా కోసం కేవలం అభిమానులు మాత్రమే కాదు, మూవీ లవర్స్ కూడా ఆతృతగా ఎదురు చూస్తారు. ఎందుకంటే ఆయన అంత అద్భుతంగా ఆ పాత్రల్లో జీవించేస్తాడు కాబట్టి.
Also Read : పెద్ది సినిమా టీజర్ లో చూపించేది ఇదేనా..? ప్రొడ్యూసర్ చెప్పిన ఆ ఒక్క షాట్ ఏంటో తెలుసా..?
అందుకే పెద్ది చిత్రం పై ఈ స్థాయి పాజిటివ్ వైబ్రేషన్స్ అలుముకున్నాయి. ఇటీవలే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ కి ఫ్యాన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది ఈ ఫస్ట్ లుక్ ని పుష్ప, కేజీఎఫ్ లుక్స్ తో పోల్చి చూసి ట్రోల్స్ చేశారు కానీ, అత్యధిక శాతం మంది మాత్రం రామ్ చరణ్ కం బ్యాక్ ఈసారి మామూలు రేంజ్ లో ఉండదు అని బలంగా నమ్ముతున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా చర్చనీయాంశంగా మారింది. ముందుగా డిజిటల్ రైట్స్ కోసం సోనీ లైవ్(Sonyliv), నెట్ ఫ్లిక్స్(Netflix) సంస్థలు పెద్ద యుద్ధమే చేసాయి. కానీ చివరికి 125 కోట్ల రూపాయలకు నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేసింది. ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) లాంటి ఫ్లాప్ తర్వాత కూడా రామ్ చరణ్ సినిమాకు ఈ రేంజ్ బిజినెస్ జరగడం చూస్తుంటే ఆయన రేంజ్ ఇసుమంత కూడా తగ్గలేదు అనే విషయం అర్థం అవుతుంది.
ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రైట్స్ డీల్ కూడా ఇటీవలే ముగిసింది. దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన ‘T సిరీస్'(T series) సంస్థ ఈ ఆడియో రైట్స్ ని 35 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ‘పుష్ప 2’ భారీ రేట్ కి ఆడియో రైట్స్ అమ్ముడుపోయిన ఏకైక పాన్ ఇండియన్ సినిమా అంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద ఫస్ట్ లుక్ తర్వాత జరిగిన ఈ నాన్ థియేట్రికల్ రైట్స్ దాదాపుగా 160 కోట్ల రూపాయలకు వరకు ఉందనీ, 20 షూటింగ్ కూడా పూర్తి కానీ ఈ సినిమాకు ఇంత బిజినెస్ జరగడం నిజంగా సెన్సేషన్ అంటూ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని అద్భుతాలను నెలకొల్పుతుందో చూడాలి.
Also Read : ‘పెద్ది’ టీజర్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ టీం..పోస్టర్ అదుర్స్!