Pushpa: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ‘బాహుబలి’ ని మించి జనాలను ప్రభావితం చేసే సినిమా రాదేమో అని అప్పట్లో అంతా అనుకున్నారు. కానీ ‘పుష్ప'(Pushpa) సిరీస్ ‘బాహుబలి'(Baahubali) కి మించిన ఫేమ్, క్రేజ్ ని సంపాదించుకుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బాక్స్ ఆఫీస్ వసూళ్ల పరంగా రాబోయే కొద్దిరోజుల్లోనే ‘పుష్ప 2′(Pushpa 2) ని ఎదో ఒక సినిమా దాటేయొచ్చు. కానీ ఈ సినిమా జనాల్లో ఏర్పాటు చేసుకున్న క్రేజ్ ని మాత్రం మ్యాచ్ చేయడం అంత తేలికైన విషయం కాదు అనే చెప్పాలి. ఈ చిత్రం లో అల్లు అర్జున్(Icon Star Allu Arjun) చెప్పిన డైలాగ్స్, ప్రదర్శించిన మ్యానరిజమ్స్, యాటిట్యూడ్ చిన్న పిల్లల దగ్గర నుండి ముసలివాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు అనుకరిస్తున్నరు. ఈ పాత్రకు ఎంత క్రేజ్ ఉంది అనేది మీకు ఒక ఉదాహరణ చూపించబోతున్నాము. బీహార్ కి చెందిన ఒక అల్లు అర్జున్ వీరాభిమాని ఉన్నాడు.
Also Read: స్టార్ హీరోయిన్ కి సిమ్రాన్ కౌంటర్..అలాంటి రోల్స్ చేసే కర్మ నాకు లేదంటూ కామెంట్స్!
ఇతని పుష్ప క్యారక్టర్ విపరీతంగా ప్రభావితం చేసింది. దీంతో పుష్ప లాగా గెటప్ వేసుకొని, పుష్ప మ్యానరిజమ్స్ ని అనుకరిస్తూ బీహార్ మొత్తం తిరిగేస్తున్నాడు. ఇతను ఎక్కడికి వెళ్లినా జనాలు వేల సంఖ్య లో వస్తున్నారు. ఇతని కోసం భారీ గా ర్యాలీలు కూడా చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. వీటిని చూసిన నెటిజెన్స్ పుష్ప డూప్ కే ఈ రేంజ్ క్రేజ్ ఉంటే, ఇక అల్లు అర్జున్ కి నార్త్ ఇండియా వైడ్ గా ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఉండుంటుందో ఊహించుకోగలం అని అంటున్నారు. ఈమధ్య కాలంలో ఇతను టీవీ షోస్ లో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాడు. రీసెంట్ గానే ఒక ప్రముఖ కంపెనీ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. రీసెంట్ గానే ఇతను ఒక కమర్షియల్ యాడ్ కూడా చేసాడు.
ఆ బ్రాండ్ కి మార్కెట్ లో ఇప్పుడు మామూలు క్రేజ్ లేదు. ఒక స్టార్ హీరో రీసెంట్ గానే ఒక కూల్ డ్రింక్ కంపెనీ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారి, ఒక యాడ్ వీడియో చేసాడు. ఆ ప్రోడక్ట్ కంటే ఎక్కువగా పుష్ప డూప్ ప్రోడక్ట్ ఇప్పుడు మార్కెట్ లో ఎక్కువగా అమ్ముడుపోతుందట. దీనిపై సోషల్ మీడియా లో ఇప్పుడు ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి. ఆ స్థాయిలో ఈ అభిమాని పుష్ప క్యారక్టర్ ని తన జీవనాధారంగా మార్చేసుకున్నాడు. రీసెంట్ గానే అల్లు అర్జున్ కూడా ఇతన్ని తన ఇంటికి పిలిపించుకొని ఆప్యాయతగా మాట్లాడాడు. అనంతరం అతని కోసం ఒక సెల్ఫీ ఫోటో కూడా ఇచ్చాడు. ఈ ఫోటోని పట్టుకొని ఈ పుష్ప డూప్ జనాల్లోకి ఇంకా ఏ రేంజ్ లో దూసుకుపోతాడో చూడాలి.
Also Read: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టూడెంట్ నెంబర్ వన్ హీరోయిన్…ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..