Prakash Raj: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నందమూరి ఫ్యామిలీపై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం తీవ్ర చర్చ నడుస్తోంది. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టడంపై పలువురు రాజకీయ నాయకులతోపాటు, నందమూరి కుటుంబ సభ్యులు స్పందించారు. ఇప్పటికే, బాలయ్య కుటుంబ సభ్యులతో కలిసి వైసీపీ నాయకుల వ్యాఖ్యలను ఖండించారు. మరోవైపు, ఎన్టీఆర్ కూడా ఈ విషయంపై స్పందించారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రదేశంలో వ్యక్తిగత దూషణలు సరికాదని.. చాలా బాధగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఓ సెల్ఫీ వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు తారక్.
— Jr NTR (@tarak9999) November 20, 2021
కాగా, ఎన్టీఆర్ ఎమోషనల్ వీడియోపై పలువురు స్పందిస్తున్నారు. నందమూరి ఫ్యామిలీకి మద్దతుగా నిలుస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. తాజాగా, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా తారక్ వీడియోపై స్పందించారు. ట్విట్టర్లో తారక్ వీడియోను రీట్వీట్ చేస్తూ.. చాలా బాగా చెప్పావ్. అంటూ క్యాప్షన్ జోడించారు. ఈ క్రమంలోనే తమకు అండగా ఉన్నానంటూ చెప్పకనే చెప్పారు ప్రకాశ్ రాజ్.
కాగా, మా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తర్వాత.. ప్రకాశ్‌రాజ్ పెద్దగా మీడియా ముందుకు రాలేదు. ఇప్పుడు మళ్లీ తారక్ ట్వీట్‌పై స్పందించి.. మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రకాశ్. మరోవైపు ఆయన ఓకల్ కార్డ్స్ దెబ్బతినడంతో వైద్యుల సూచన మేరకు మౌనవ్రతం పాటిస్తున్నారు. అందుకే ఇటీవల కాలంలో ఆయన నటించిన సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పుకోలేదు.