Nagavamsi comments: నిర్మాత నాగవంశీ(Nagavamsi) ఏ తన సినిమా ప్రొమోషన్స్ సమయం లో ఇచ్చే ఇంటర్వ్యూస్ లో మాట్లాడే కొన్ని బోల్డ్ మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆయన నిర్మాణ సంస్థ నుండి ఈ నెల 31 న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరో గా నటించిన ‘కింగ్డమ్'(Kingdom Movie) అనే చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. అందులో భాగంగా రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ లో సోషల్ మీడియా లో తమపై విమర్శలు చేసే నెటిజెన్స్ పై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఆయన మాట్లాడుతూ ‘ట్విట్టర్ లో కొంతమంది పిచ్చ నాకొడుకులు మాట్లాడే మాటలు చూస్తుంటే చాలా చిరాకు వేస్తూ ఉంటుంది. మాకు 10 రూపాయలకు అది వస్తుంది, 50 రూపాయలకు ఇది వస్తుంది, మరి అదే రేట్ కి సినిమా ఎందుకు రాదు అంటున్నారు’
Also Read: 150 అనాధాశ్రమాలను దత్తత తీసుకున్న మెగా కోడలు ఉపాసన కొణిదెల!
‘చేతిలో మొబైల్ ఉందికదా అని ట్విట్టర్ లో ఏది పడితే అది వాగేయడం చాలా తేలిక. నీకు నచ్చిన థియేటర్ లో నీ కుటుంబం మొత్తంతో కలిసి ఎంజాయ్ చేసే సినిమాని మేము మీకు అందిస్తున్నాము. ట్విట్టర్ లో ఎవరెన్ని మాట్లాడినా ప్రపంచం లో ఎంటర్టైన్మెంట్ అత్యంత చీప్ గా దొరికేది ఏదైనా ఉందా అంటే అది సినిమా మాత్రమే. ఇద్దరు స్నేహితులు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సినిమా గురించే మాట్లాడుకుంటారు. సినిమా బాగాలేక పోతే తిడుతారు. ఆ తిట్టేది ఎదో టికెట్ కొని, సినిమా థియేటర్ లో చూసి తిట్టండి. పైరసీ లో సినిమా ని చూసే మీరు మమ్మల్ని అంటున్నారు’ అంటూ నాగవంశీ చాలా ఘాటుగా స్పందించాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలకు సోషల్ మీడియా లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక కింగ్డమ్ విషయానికి వస్తే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Also Read: పోకిరి సినిమాకి డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాదా..? ఇదేమి ట్విస్ట్ బాబోయ్!
అందుకే విజయ్ దేవరకొండ కి వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ఉన్నప్పటికీ కూడా ఈ చిత్రానికి 50 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఆయన గత సినిమాలకు వచ్చిన క్లోజింగ్ కలెక్షన్స్ కి , ఈ సినిమా బిజినెస్ కి అసలు సంబంధమే లేదు. ఇంత బిజినెస్ జరగడానికి కారణం టీజర్ అని చెప్పొచ్చు. టీజర్ ని చూసిన తర్వాత ప్రతీ ఒక్కరికి విజయ్ దేవరకొండ ఈ చిత్రం తో భారీ కం బ్యాక్ ఇవ్వబోతున్నాడు అనే నమ్మకం కలిగింది. మొదటి లిరికల్ వీడియో సాంగ్ ఎదో పర్వాలేదు అనే రేంజ్ లో ఉంది కానీ, ఆడియన్స్ లోకి బలంగా వెళ్ళలేదు. ఇక రెండవ లిరికల్ వీడియో సాంగ్ ‘అన్న అంటేనే’ కి సంబంధించిన ప్రోమో ని నిన్ననే విడుదల చేశారు. ఈ ప్రోమో కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.