Upasana Konidela: టాలీవుడ్ లో సామజిక స్ఫూర్తిని అణువణువునా నింపుకొని, తనని ఇంత గొప్పవాడిని చేసిన అభిమానులకు తిరిగి ఎదో ఒకటి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) చేసిన సేవ కార్యక్రమాలు ఎలాంటివో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాజకీయాల్లోకి రాకముందే ఆయన బ్లడ్ బ్యాంక్, నేత్ర దానం వంటి కార్యక్రమాలను నిర్వహించి ఎన్నో వేలమంది అభిమానులకు సహాయసహకారాలు అందించాడు,ఇప్పటికీ అందిస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ కూడా రాష్ట్రం లో ఏ చిన్న సమస్య వచ్చిన సహాయం చేయడానికి ముందు ఉండే చెయ్యి మన మెగాస్టార్ చిరంజీవి గారిదే. ఆయన్ని చూసి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు స్ఫూర్తి పొంది సేవా కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టారు. చిరంజీవి ని చూసి ఆయన కుటుంబ సభ్యులు కూడా అలాగే తయారయ్యారు. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, ఆయన చేసిన సేవాకార్యక్రమాలతో నేడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు.
Also Read: ఏంటి హరి హర వీరమల్లు నైజాం డీల్ ఇంకా క్లోజ్ కాలేదా? ఏం జరుగుతుంది?
ఇక రామ్ చరణ్(Global star Ram Charan), సాయి ధరమ్ తేజ్ వంటి వారు కూడా ఎన్నో సహాయసహకారాలు అందించారు. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల(Upasana Konidela) గురించి ఈ విషయం లో ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. దేశం లో ఉన్న ఉన్న అపోలో హాస్పిటల్స్ అన్నిటికి ఆమె చైర్మన్. అయినప్పటికీ కూడా ఇసుమంత గర్వం కూడా ఆమెలో కనిపించదు. సోషల్ మీడియా ద్వారా ఎన్నో హెల్త్ టిప్స్ చెప్తూ అందరికీ ఉపయోగపడే పోస్టులు వేసే ఉపాసన, తన అపోలో హాస్పిటల్స్ ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహించింది. రీసెంట్ గా ఆమె 150 కి పైగా అనాధాశ్రమాలను దత్తత తీసుకొని తన విశాల హృదయాన్ని చాటుకుంది. రీసెంట్ గా ఆమె ఒక అనాధాశ్రమం కి వెళ్లి తన చేతుల మీదుగా అనాధ పిల్లలకు అన్నం వడ్డించడం, బట్టలు పంచడం వంటివి చేసింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
Also Read: బిగ్ బాస్ ఫేమ్ ఇనయ సుల్తానా బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసా? ఓపెన్ గా చూపించి షాక్ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ
ఆమె దత్తత తీసుకున్న విషయం చాలా మందికి తెలియదు. రీసెంట్ గా తీసుకోవడం కాదు, 2018 వ సంవత్సరం నుండి ఆమె ఈ కార్యక్రమాలు చేపడుతుంది. అభిమానులు ఆ వివరాలను షేర్ చేస్తూ సోషల్ మీడియా లో గర్వం గా తమ వదిన మనస్సు ఎంత గొప్పదో చెప్పుకొస్తున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపుగా 150 అనాధాశ్రమాలను దత్తత తీసుకున్న ఉపాసన, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అనాధాశ్రమాలను దత్తత తీసుకునేందుకు చర్యలు చేపడుతుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.