Pokiri Director Controversy: తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎప్పటికీ మర్చిపోలేని కొన్ని ఇండస్ట్రీ హిట్స్ ఉంటాయి. ఆ సినిమాలు సృష్టించిన ప్రభంజనం ఒక జనరేషన్ జనాలకు ఏళ్ళ తరబడి అలా గుర్తుండిపోయి ఉంటుంది. అలాంటి సినిమాల్లో ఒకటి ‘పోకిరి'(Pokiri Movie). ప్రిన్స్ మహేష్ బాబు ని కాస్త సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) గా మార్చిన చిత్రమిది. పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి వారం మొత్తం ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ ఉండేది. కానీ మాస్ ఆడియన్స్ లోకి బాగా వెళ్లిన తర్వాత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఇక కలెక్షన్ల సునామీ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లోనే ఈ చిత్రం దాదాపుగా 80 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. షేర్ వసూళ్లు దాదాపుగా 40 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది.
Also Read:150 అనాధాశ్రమాలను దత్తత తీసుకున్న మెగా కోడలు ఉపాసన కొణిదెల!
రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ప్రతీ సెంటర్ లోనూ ఆల్ టైం రికార్డుని నమోదు చేసిన ఈ చిత్రం, 50 డేస్ సెంటర్స్ , 100 డేస్ సెంటర్స్, 175 డేస్ సెంటర్స్ ఇలా అన్ని క్యాటిగిరీలోనూ ఆల్ టైం అన్ బీటబుల్ రికార్డ్స్ ని నెలకొల్పింది. ఈ చిత్రాన్ని హిందీ, కన్నడ, తమిళ భాషల్లో రీమేక్స్ చేసి, అక్కడి హీరోలు కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నారు. ఈ చిత్రాన్ని ఆరోజుల్లోనే పాన్ ఇండియన్ సినిమా గా విడుదల చేసి ఉండుంటే, అప్పట్లోనే మనం వంద కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను చూసి ఉండేవాళ్లమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అప్పట్లో మాస్ ఫ్యాక్షన్ సినిమాలదే రాజ్యం, ఈ చిత్రం ఆ ట్రెండ్ ని బ్రేక్ చేసి సరికొత్త ట్రెండ్ ని నెలకొల్పి, ఇది కదా అసలు సిసలు మాస్ అంటే అని మాస్ ఆడియన్స్ చెప్పుకొని తిరిగేవారు.
Also Read: రవితేజ తండ్రి మరణం పై మెగాస్టార్ చిరంజీవి సంచలన కామెంట్స్!
అయితే ఈ చిత్రం కథ విషయం లో కొన్ని షాకింగ్ విషయాలు రీసెంట్ గానే తెలిసాయి. మొదట్లో ఇది రాజస్థాన్ బ్యాక్ డ్రాప్ లో తీద్దాం అని అనుకున్నారట. ముందుగా పవన్ కళ్యాణ్, రవితేజ వద్దకు ఈ స్టోరీ వెళ్ళింది. వాళ్ళు ఎందుకో ఈ కథని ఒప్పుకోలేదు, ఇక చివరికి మహేష్ బాబు వద్దకు వచ్చింది. ఆయన వద్దకు వచ్చిన తర్వాత కథలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అన్ని మహేష్ బాబు సూచనల మేరకే పూరి జగన్నాథ్ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేశాడు. ప్రకాష్ రాజ్ క్యారక్టర్ కూడా మహేష్ బాబు చెప్పబట్టే రాసాడట పూరి జగన్నాథ్. అలా మహేష్ బాబు స్క్రిప్ట్ లో తలదూర్చి మార్పులు చేయబట్టే పోకిరి సినిమా వచ్చింది. అందుకే మహేష్ బాబు లేకుంటే అసలు పండుగాడు క్యారక్టర్ అనేదే ఉండేది కాదు అంటూ సోషల్ మీడియా లో మహేష్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఒకవిధంగా ఈ చిత్రానికి మహేష్ బాబు అనధికారిక డైరెక్టర్ అని కూడా అంటున్నారు.