Homeఎంటర్టైన్మెంట్Prakash Raj: రామ లక్ష్మణులపై నటుడు ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. సంచలనం రేపుతున్న వీడియో..

Prakash Raj: రామ లక్ష్మణులపై నటుడు ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. సంచలనం రేపుతున్న వీడియో..

Prakash Raj: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ నటులలో ఒకరు ప్రకాష్ రాజ్. గత రెండున్నర దశాబ్దాల నుండి విరామం లేకుండా సినిమాలు చేస్తూ , ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ చేస్తూ, విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. నటుడిగా ఆయన్ని ద్వేషించేవాళ్ళు ఏ ఇండస్ట్రీ లో కూడా ఉండరు, కానీ వ్యక్తిగతంగా మాత్రం ఇతని సిద్ధాంతాలు వివాదాస్పదమైనవి. సెక్యూలర్ ముసుగు లో హిందువులను ద్వేషిస్తున్నట్టుగా ఇతను మాటలు ఉంటాయి. హిందూ దేవుళ్ల దేవాలయాలపై దాడి జరిగినప్పుడు నోరు […]

Prakash Raj: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ నటులలో ఒకరు ప్రకాష్ రాజ్. గత రెండున్నర దశాబ్దాల నుండి విరామం లేకుండా సినిమాలు చేస్తూ , ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ చేస్తూ, విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. నటుడిగా ఆయన్ని ద్వేషించేవాళ్ళు ఏ ఇండస్ట్రీ లో కూడా ఉండరు, కానీ వ్యక్తిగతంగా మాత్రం ఇతని సిద్ధాంతాలు వివాదాస్పదమైనవి. సెక్యూలర్ ముసుగు లో హిందువులను ద్వేషిస్తున్నట్టుగా ఇతను మాటలు ఉంటాయి. హిందూ దేవుళ్ల దేవాలయాలపై దాడి జరిగినప్పుడు నోరు మెదపని ప్రకాష్ రాజ్, ఇతర మతాలకు ఏ చిన్న ఆపద కలిగినా #JustAsking అనే హ్యాష్ ట్యాగ్ తో తీవ్రంగా తన గళం వినిపిస్తూ ఉంటాడు. ప్రకాష్ రాజ్ కి హిందూ దేవుళ్లపై ఎంత ద్వేషం ఉందో చెప్పడానికి , రీసెంట్ గా ఆయన ఈవెంట్ లో మాట్లాడిన మాటలను నిదర్శనంగా తీసుకోవచ్చు.

మన ఇండియాలో కోట్లాది మంది ఎంతో ఇష్టంతో కొలిచే శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఇప్పుడు భక్తులను తీవ్రమైన ఆగ్రహానికి గురయ్యేలా చేస్తోంది. శ్రీ రామ లక్ష్మణులను ఆయన ఏకంగా వలస కూలీలతో పోల్చడాన్ని చూస్తుంటే , ఎవరి రక్తం అయినా మరగక తప్పదు. ఆయన మాట్లాడుతూ ‘ రాముడు , లక్ష్మణుడు నార్త్ ఇండియా నుండి సౌత్ కి వచ్చిన వలస కూలీలు. రామ లక్ష్మణులు మన సౌత్ లోకి ప్రవేశించి ఒక పొలం లోకి అడుగుపెట్టాడు. అక్కడ ఆ యజమానిని అడగకుండా పండ్లను దొంగతనం చేసి తిన్నారు. ఆ పొలానికి యజమాని మరెవరో కాదు , గిరిజనుడు అయిన రావణాసురుడు. పండ్ల దొంగతనం పై రావణుడి సోదరి సూర్పనక్క ప్రశ్నించడం తో వివాదం మొదలైంది. జీఎస్టీ తో కలిపి 2000 డాలర్లు కట్టాలంటూ సూర్పనక్క డిమాండ్ చేసింది. అక్కడి నుండి గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు తీవ్రమైన వివాదాలకు దారి తీసింది.

హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తూ, కోట్లాది మంది సెంటిమెంట్స్ ని మంటగలుపుతూ, తిరుమల లడ్డూలు కల్తీ జరిగితే ప్రశ్నించినందుకు పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ ఏ రేంజ్ లో విమర్శించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఇతర మతాలను కించపరిచే విధంగా ఎలాంటి కామెంట్స్ చేయకపోయినా, ఆయన మాత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు అంటూ పెద్ద ఎత్తున హంగామా చేసాడు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఏకంగా హిందువులు ఎంతో భక్తి తో కొలిచే శ్రీరాముడి పై అనుచిత కామెంట్స్ చేసాడు. ఇలా ఆయన అల్లా, జీసస్ మీద నీచమైన కామెంట్స్ చేయగలడా, హిందువులు అంటే ఎందుకు అంత ద్వేషం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ప్రకాష్ రాజ్ ని ట్యాగ్ చేసి నిలదీస్తున్నారు. ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ని మీకిశోరం క్రింద అందిస్తున్నాము చూడండి.

 

View this post on Instagram

 

A post shared by DailyGist (@dailygist.in)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper