Homeఎంటర్టైన్మెంట్Varanasi: 'వారణాసి' లో మహాశివుడి భక్తుడిగా ప్రకాష్ రాజ్..రాజమౌళి పై మండిపడుతున్న ఫ్యాన్స్!

Varanasi: ‘వారణాసి’ లో మహాశివుడి భక్తుడిగా ప్రకాష్ రాజ్..రాజమౌళి పై మండిపడుతున్న ఫ్యాన్స్!

Varanasi: మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి'(Varanasi Movie) మూవీ షూటింగ్ ప్రస్తుతం ‘జార్జియా’ లో జరుగుతోంది. మహేష్ బాబు మరియు ఇతర తారాగణం పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ఈ సినిమా షూటింగ్ సాగుతూనే ఉంది. సెప్టెంబర్ లోపు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చెయ్యాలని చూస్తున్నారు మేకర్స్. ఇకపోతే ఈ చిత్రం లో ప్రకాష్ రాజ్ మహేష్ బాబు కి తండ్రి […]

Varanasi: మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి'(Varanasi Movie) మూవీ షూటింగ్ ప్రస్తుతం ‘జార్జియా’ లో జరుగుతోంది. మహేష్ బాబు మరియు ఇతర తారాగణం పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ఈ సినిమా షూటింగ్ సాగుతూనే ఉంది. సెప్టెంబర్ లోపు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చెయ్యాలని చూస్తున్నారు మేకర్స్. ఇకపోతే ఈ చిత్రం లో ప్రకాష్ రాజ్ మహేష్ బాబు కి తండ్రి పాత్రలో కనిపిస్తాడనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ పాత్ర కోసం చాలా మంది హీరోలను సంప్రదించారు. కానీ చివరికి ప్రకాష్ రాజ్ ని ఫైనల్ చేశారు. మహేష్ బాబు , ప్రకాష్ రాజ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అత్యధిక శాతం భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఎవర్ గ్రీన్ కాంబినేషన్ గా ఆడియన్స్ పిలుస్తుంటారు.

ఇది ఇలా ఉండగా రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ప్రకాష్ రాజ్ ‘వారణాసి’ లోనే తన పాత్ర గురించి వివరిస్తూ , ఇందులో తాను మహాశివుడి భక్తుడిగా కనిపిస్తానని చెప్పుకొచ్చాడు. దీనిపై సోషల్ మీడియా లో ఇప్పుడు తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ప్రకాష్ రాజ్ ఒక నాస్తికుడు. అంతే కాదు, ఇతనొక హిందూ వ్యతిరేకి అని అందరూ అంటుంటారు. అలాంటి వ్యక్తితో శివ భక్తుడి క్యారెక్టర్ చేయించడం ఏంటి?, ఇది అసలు కరెక్ట్ కాదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం ప్రకాష్ రాజ్ మాత్రమే కాదు, డైరెక్టర్ రాజమౌళి కూడా నాస్తికుడే. అయినప్పటికీ ఫ్యాన్స్, ఆడియెన్స్ ఆయన్ని అంగీకరించారు. ఎందుకంటే నాస్తికుడు అయినప్పటికీ కూడా సినిమా విషయానికి వస్తే దేవుడిని ఆయన ఎక్కడా తగ్గించి చూపించడు అనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. కానీ ప్రకాష్ రాజ్ ప్రతీ రోజు చేసే కామెంట్స్ ని చూసిన తర్వాత అతన్ని శివ భక్తుడిగా ఊహించుకోలేకపోతున్నారు ఆడియన్స్.

మరి రాజమౌళి ఆయన్ని ఎలా చూపించబోతున్నారు అనేది చూడాలి. గతంలో ప్రకాష్ రాజ్ ‘డమరుకం’ చిత్రం లో శివుడి క్యారెక్టర్ ని పోషించాడు. అప్పట్లో ఆయన నటన పై చాలా విమర్శలు కూడా వచ్చాయి. శివుడి గా ప్రకాష్ రాజ్ అసలు సూట్ అవ్వలేదంటూ చాలా మంది కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ శివ భక్తుడి క్యారెక్టర్ ని రాజమౌళి ఎలా డీల్ చేస్తాడో చూడాలి. ఇకపోతే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే అధికారిక ప్రకటన చేశారు. ఆ ప్రకటన కు తగ్గట్టుగానే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఈసారి పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ చిత్రం విడుదల కాబోతుంది కాబట్టి, రాజమౌళి ప్లానింగ్ ప్రకారం హాలీవుడ్ మీడియా చానెల్స్ కి వరుసగా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper