Prabhas: యంగ్ రెబల్ స్టార్ గా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న నటుడు ప్రభాస్… కృష్ణంరాజు నటవరసత్వాన్ని పునికి పుచ్చుకున్న ఆయన ఎక్కడా తగ్గకుండా వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఆయన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో సైతం ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తుండడం విశేషం… ప్రస్తుతం ఆయన ఫౌజీ, స్పిరిట్ రెండు సినిమాలను చేస్తున్నాడు. ఇక మరో సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకీ ఆయన చేయబోయే సినిమా ఏంటి అంటే బాలీవుడ్ ఇండస్ట్రీ లో దురందర్ సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన ఆదిత్యధర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా చాలా వైలెంట్ గా తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రభాస్ ని చాలా వైల్డ్ గా చూపించే ప్రయత్నం అ చేస్తున్నారట. ఇక ఏది ఏమైనా కూడా ఆదిత్యధర్ లాంటి దర్శకుడు డిఫరెంట్ సినిమా మేకింగ్ తో సినిమా మొత్తాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి ప్రభాస్ లాంటి హీరో దొరికితే ఆయన మరింత రెచ్చిపోయే అవకాశాలైతే ఉన్నాయి.
యాక్షన్ ఓరియంటెడ్ సినిమాగానే తెరకెక్కినప్పటికి ఈ సినిమాలో కథ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ప్రభాస్ సైతం ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆగస్టు నెలలో ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
మొత్తానికైతే ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తుండడం విశేషం…ఫౌజీ, స్పిరిట్ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ఆయన ‘కల్కి 2’ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఇక ఆ తర్వాత అదిత్యధర్ సినిమా తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘సలార్ 2’ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనే అవకాశాలైతే ఉన్నాయి…
